Asianet News TeluguAsianet News Telugu

secunderabad violence: ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు.. హైదరాబాద్‌‌కు తరలింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో కీలక సూత్రధారిగా భావిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపటి నుంచి సుబ్బారావును ప్రశ్నించనున్నారు పోలీసులు. 

avula subba rao who Suspect in Secunderabad violence taken into telangana police custody
Author
Hyderabad, First Published Jun 21, 2022, 8:29 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో కీలక సూత్రధారిగా భావిస్తోన్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విధ్వంసంలో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన విద్యార్ధులు భారీగా పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం 10 బ్రాంచ్‌లకు చెందిన విద్యార్ధులు అల్లర్లలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు సుబ్బారావును తరలిస్తున్నారు తెలంగాణ పోలీసులు. రేపటి నుంచి సుబ్బారావును ప్రశ్నించనున్నారు పోలీసులు. 

ఇకపోతే.. Secundrabad రైల్వే స్టేషన్ లో విధ్వసానికి సంబంధించి దర్యాప్తును SIT మరింత వేగవంతం చేసింది. ఈ కేసుతో ప్రమేయం ఉందనే అనుమానంతో మరో 15 మందిని Railway  పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  ఈ నెల 17వ తేదీన Agnipath కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో Army ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికే 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 11 మంది పరారీలో ఉన్నారని రైల్వే పోలీసులు Remand Report లో పేర్కొన్నారు.

ALso Read:Agnipath protest in Secundrabad పోలీసుల అదుపులో మరో 15 మంది: సాయి డిఫెన్స్ అకాడమీలో ముగిసిన తనిఖీలు

రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి నిందితులు వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని కూడా పోలీసులు గుర్తించారు. ఈ విషయాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు ఈ విధ్వంసాల వెనుక ప్రైవేట్ Defence అకాడమీల పాత్ర ఉందని రైల్వే ఎస్పీ Anuradha రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఏయే డిఫెన్స్ అకాడమీలు  దీని వెనుక ఉన్నాయనే  విషయమై పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని డిఫెన్స్ అకాడమీలను గుర్తించామని రైల్వే పోలీసులు చెబుతున్నారు. 

రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్, ఛలో సికింద్రాబాద్ ఏఆర్ఓ 3, ఆర్మీ జీడీ 2021 మార్చ్ ర్యాలీ, సీఈఈ సోల్జర్ గ్రూపులు క్రియేట్ చేశారని  పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఒక వాట్సాప్ గ్రూప్ ఆడ్మిన్ ను పోలీసులు  అరెస్ట్ చేశారు. మిగిలిన ఏడు గ్రూప్ ఆడ్మిన్లు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios