Asianet News TeluguAsianet News Telugu

అందుబాటులోకి స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లు- బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి

సివిల్స్ అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆ స్టడీ సెంటర్ డైరెక్టర్ తెలిపారు. 

Available Screening Test Hall Tickets- BC Study Circle Director Namoju Balachari
Author
Hyderabad, First Published Dec 7, 2021, 6:42 PM IST

సివిల్స్ రాసే అభ్య‌ర్థుల కోసం తెలంగాణ బీసీ స్ట‌డీ స‌ర్కిల్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామ‌ని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి తెలిపారు. దాని కోసం అభ్య‌ర్థుల నుంచి కొంత కాలం క్రిత‌మే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 11వ తేదీన‌ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు.  ఉచిత కోచింగ్ కోసం అప్లే చేసిన అభ్య‌ర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బిసీ స్టడీ సర్కిల్  వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in ద్వారా ఈ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌రీక్ష కోసం 3064 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని చెప్పారు.

https://telugu.asianetnews.com/gallery/jobs/rrb-ntpc-result-by-15th-january-2022-announced-by-official-details-here-r3muwg#image1

ఈ నెల 11వ తేదీన రెండు షిఫ్టులో ఈ ప‌రీక్ష జ‌రుపుతుంద‌ని తెలిపారు. ఉద‌యం 9 నుంచి 11 వ‌ర‌కు మొద‌టి పరీక్ష‌ ఉంటుందని, 12 నుంచి 2 వ‌ర‌కు ఇంకో ప‌రీక్ష ఉంటుంద‌ని తెలిపారు. 100 మార్కుల ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంద‌ని చెప్పారు. ఇంగ్లీష్‌లో ఉండే ఈ ప్ర‌శ్న‌ప‌త్రంలో నెగిటెవ్ మార్కింగ్ ఉంటుంద‌ని తెలిపారు. అభ్య‌ర్థులు ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని సూచించారు. ప‌రీక్ష కేంద్రానికి వ‌చ్చేట‌ప్పుడు మాస్క్ ధ‌రించి రావాల‌ని చెప్పారు. లేక‌పోతే ప‌రీక్ష హాలులోకి అనుమతించ‌మ‌ని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధన‌లు ప్ర‌తీ ఒక్క‌రూ పాటించి, ప‌రీక్ష‌కు హాజ‌రుకావాల‌ని తెలిపారు. ఈ ప‌రీక్ష‌లు ప్ర‌తిభ క‌న‌బ‌రిస్తే హాస్టల్‌తో కూడిన ఉచిత కోచింగ్ ఇస్తామ‌ని చెప్పారు. మెటీరియ‌ల్ కూడా ఉచితంగా అందిస్తామ‌ని తెలిపారు. ఈ అవ‌కాశాన్ని అభ్య‌ర్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios