Rajanna-Sircilla: సిరిసిల్లలో ఆటోరిక్షా బోల్తా పడి 20 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు అయ్యాయి. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం వల్లంపట్ల నుంచి వ్యవసాయ కూలీలు ఒక ఆటోలో నక్కపల్లికి వ్యవసాయ పొలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది.
20 agricultural labourers injured in Sircilla: వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఒక ఆటో బోల్తా పడింది. ఈ ఘటన లో 20 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్లలో ఆటోరిక్షా బోల్తా పడి 20 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు అయ్యాయని తెలిపారు. వల్లంపట్ల నుంచి వ్యవసాయ కూలీలు ఒక ఆటోలో నక్కపల్లికి వ్యవసాయ పొలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఇల్లందకుంట మండలం వల్లంపట్ల సమీపంలో సోమవారం ఉదయం నాలుగు చక్రాల ఆటో బోల్తా పడటంతో 20 మంది వ్యవసాయ కూలీలకు గాయాలయ్యాయి. వల్లంపట్లకు చెందిన వ్యవసాయ కూలీలు ఎక్కువగా నక్కపల్లికి వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. వాహనం అక్కడికి చేరుకోగానే డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. చెట్టును ఢీకొనడంతో వాహనం బోల్తా పడింది.
అతివేగం, ఓవర్ లోడ్ దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 20 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని కూలీలను రక్షించారు. క్షతగాత్రులను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.
