TSRTC : మహాలక్ష్మీ స్కీమ్ ఎఫెక్ట్ ... నడిరోడ్డుపై ఆర్టిసి డ్రైవర్ పై ఆటోవాలాల దాడి

మహాలక్ష్మి పథకం వల్ల తమ గిరాకీ దెబ్బతింటోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదికాస్త కోపంగా మారి ఆర్టిసి సిబ్బందిపై దాడులకు దారితీస్తోంది. 

Auto drivers attacked RTC Bus Driver at Kothagudem AKP

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడాన్ని ఆటోవాలాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ  మహాలక్ష్మి స్కీమ్ వల్ల  తమ జీవితం మరింత దుర్భరంగా మారుతోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరాకీల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని...మరీ ముఖ్యంగా మహిళలు ఆటో ఎక్కడమే మానేసారని అంటున్నారు. దీంతో ఆదాయం లేక కుటుంబంతో సహా రోడ్డునపడే పరిస్థితి వచ్చిందంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇలా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, టీఎస్ ఆర్టిసి పై గుర్రుగా వున్నారు ఆటోవాలాలు. ఆర్టిసి సిబ్బందిని శతృవుల్లాగా చూస్తున్న ఆటో డ్రైవర్లు వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఆర్టిసి బస్ డ్రైవర్ ను పట్టుకుని ఆటోవాలాలు చితకబాదారు. 

వివరాల్లోకి వెళితే... కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద ఆటోలో వెళ్లేందుకు కొందరు ప్రయాణికులు కూర్చున్నారు. ఈ సమయంలోనే ఖమ్మం వైపు వెళుతున్న ఆర్టిసి బస్సు అటువైపు వచ్చింది.  దీంతో ఆటో దిగిన ప్రయాణికులు బస్సును ఆపారు. అసలే గిరాకీలు లేక ఇబ్బందిపడుతున్న ఆటో డ్రైవర్లు ఇలా ప్రయాణికులు ఆటో దిగి బస్సెక్కడంతో ఆగ్రహానికి గురయ్యారు... ఈ ఆవేశంలో బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడిచేసారు. 

Also Read  ర్యాష్ డ్రైవింగ్ కేసు.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై లుకౌట్ నోటీసులు

బస్సు  డ్రైవర్ ను బయటకు లాగిన ఆటోవాలాలు అసభ్యంగా దూషిస్తూ దాడి చేసారు. అతడి నీళ్లు చల్లుతూ దారుణంగా వ్యవహరించారు. బస్ కండక్టర్ తో పాటు ప్రయాణికులు, ఇతర వాహనదారులు ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. కానీ ఆటోడ్రైవర్లు ఎవరిమాటా వినకుండా దారుణంగా వ్యవహరించారు. 

తనపై జరిగిన దాడిని ఆర్టిసి ఉన్నతాధికారుల ద‌‌ృష్టికి తీసుకెళ్లాడు బాధిత డ్రైవర్ నాగరాజు. వారి సూచనమేరకు కొత్తగూడెం ఆర్టిసి డిపో మేనేజర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత ఆర్టిసి డ్రైవర్ నుండి దాడి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్లను గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios