హైదరాబాద్: తెలంగాణలోని మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్, హత్యోదంతం మరిచిపోక ముందే అటువంటి ఘటనే హైదరాబాదు సమీపంలోని షామీర్ పేటలో చోటు చేసుకుంది. 

ఆటో డ్రైవర్ కు చెందిన కుమారుడిని ఓ యువకుడు లు కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఇందుకు సంబంధించి పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

ఈ నెల 15వ తేదీన శామీర్ పేటకు చెందిన బాలుడు అదృశ్యమయ్యాడు. దానిపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, బాలుడు శవమై తేలాడు. బాలుడి శవం ఔటర్ రింగ్ రోడ్డుపై కనిపించింది. 

షేర్ చాట్ యాప్ వీడియోల కోసం కోసం స్కిట్ చేస్తుండగా బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన వ్యక్తి 15 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడు. బాలుడు మరణించిన తర్వాతనే ఫోన్ చేసి డబ్బులు అడిగినట్లు తెలుస్తోంది. బాలుడిని కిడ్నాప్ చేసిన యువకుడు బీహార్ కు చెందినవాడని తెలుస్తోంది.