మంచినీళ్లు అనుకొని ఓ వ్యక్తి మందులో యాసిడ్ కలుపుకొని తాగాడు.

మంచినీళ్లు అనుకొని ఓ వ్యక్తి మందులో యాసిడ్ కలుపుకొని తాగాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన చంద్రాయగుణ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పూర్తి వివరాల్లోకి వెళితే.. చంద్రాయణగుట్ట కుమ్మరివాడలో నివసించే గణపతిస్వామి రెండో కుమారుడు విజయ్ కుమార్ స్వామి(26) ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 27వ తేదీ ఆదివారం మద్యం సీసా తీసుకొని ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో మిద్దెపైకి ఎక్కి.. మందు తాగడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు.

కాగా.. ఇంట్లో ఉన్న యాసిడ్ బాటిల్ ని చూసి.. మంచినీళ్లు అనుకొని భ్రమపడ్డాడు. దానిని మందులో కలుపుకొని తాగాడు. తాగిన తర్వాత అది యాసిడ్ అని గ్రహించాడు. గొంతు మంట పుట్టడంతో కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.