Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డిపై చెప్పులు విసిరేందుకు యత్నం.. ఇద్దరు అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల అరెస్ట్

Mahabubabad: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొంద‌రు వ్య‌క్తులు చెప్పులు విసిరేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. వారు అధికార పార్టీకి చెందిన వారని స‌మాచారం. 
 

Attempts to throw slippers at Telangana Congress chief Revanth Reddy; Two BRS activists arrested
Author
First Published Feb 9, 2023, 7:57 AM IST

Telangana Congress chief Revanth Reddy: పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై కొంద‌రు వ్య‌క్తులు చెప్పులు విసిరేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. వారు అధికార పార్టీకి చెందిన వారని స‌మాచారం. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ను మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో కసరత్తు ప్రారంభించారు. ములుగు నియోజకవర్గంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం వ‌న‌దేవ‌త‌లు సమ్మక్క సారలమ్మల ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ఆయ‌న రాష్ట్రవ్యాప్త పాద‌యాత్ర‌ను సోమ‌వారం నాడు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి పాద‌యాత్ర మ‌హ‌బూబాబాద్ కు చేరుకున్న క్ర‌మంలో అక్క‌డ అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌ను అడ్డుకునే చ‌ర్య‌ల‌కు య‌త్నించారు. నినాదాలు చేస్తూ.. రేవంత్ రెడ్డిపై చెప్పులు విసిరేందుకు ప్ర‌య‌త్నించారు. 

అక్క‌డున్న పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై వారిని అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డిపై చెప్పులు విసిరేందుకు ప్రయ‌త్నించిన వారు అధికార పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ని స‌మాచారం. ఆ స‌మ‌యంలో వీరు జై శంక‌ర్ నాయ‌క్ అంటూ నినాదాలు సైతం చేశారు. జై శంక‌ర‌న్న‌, జై శంక‌ర‌న్న అంటు నినాదాలు చేస్తున్న క్ర‌మంలో వెంట‌నే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.


స్వరాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల బాటన నడుస్తోంది.సిబ్బందికి ఉద్యోగ భద్రత పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆరోగ్యం పాడైనా తమ జీవితాలను ఆర్టీసీకే అంకితం చేసిన ఉద్యోగులు, కార్మికులను ఆదుకోవాల్సిన, ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఇది డ్రైవరన్న మనోగతం : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్

కాగా, పార్టీ హాత్ సే హాత్ జోడో అభియాన్ కు కొనసాగింపుగా చేపట్టిన 'యాత్ర'తో వైఎస్ మాదిరిగానే ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ రేడ్డి భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేయడానికి ఉద్దేశించిన హాత్ సే హాత్ జోడో అభియాన్ ను తన యాత్రకు విస్తరింపజేయడానికి, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమైన సమస్యలు, విఫలమైన వాగ్దానాలను ఎత్తిచూప‌డం ల‌క్ష్యంగా ఆయ‌న యాత్ర‌తో ముందుకు సాగుతార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 2003లో ఉన్న పరిస్థితినే 2023లోనూ పునరావృతం చేస్తున్నారు. విద్యుత్ రంగంలో సంక్షోభం నెలకొందనీ, రైతులకు కనీస మద్దతు ధర లేకుండా పోయిందని, రుణమాఫీ జరుగుతోందని, ఈ సమయంలో యాత్ర చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

యాత్ర మూడో రోజున ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ.. 1 జనవరి 2024 లో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్య‌క్తం చేశారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పట్టాలిస్తామ‌నీ, వారి ఆత్మ గౌరవాన్ని నిలబెడతామ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే, భూ నిర్వాసితులందరికి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని స్ప‌ష్టం చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios