పోలీసుల కౌన్సెలింగ్‌తో భరత్ మారిపోతాడనుకున్నాం కానీ ఇంతలోనే దారుణానికి ఒడిగడతాడని అనుకోలేదన్నారు ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మధులిక తల్లి. కుమార్తెపై దాడి విషయాన్ని తెలుసుకున్న ఆమె మలక్‌పేట యశోదా ఆసుపత్రికి చేరుకుని.. కూతురి పరిస్ధితి చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తన బిడ్డ పరిస్ధితి ఆందోళనకరంగా ఉందన్నారు. భరత్ కొంతకాలంగా తమ కుమార్తెను వేధిస్తున్నాడని, దీనిపై నెల రోజుల క్రితం షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

పోలీసుల ఎదుట తనకు, మధులికకు భరత్ క్షమాపణలు చెప్పాడని కొద్దిరోజులు బుద్ధిగా ఉన్నాడన్నారు. అయితే తన కుమార్తెపై కక్ష పెంచుకున్న భరత్..ఇంటి మేడపై నుంచి మధులిక కదలికలను గమనించేవాడని తెలిపారు. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్తుండగా దాడి కాపు కాసి దాడి చేశాడని ఆమె వెల్లడించారు.  

హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి