తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యాలయం ముఖ్దూం భవన్‌పై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్యాలయ ఆవరణలో పార్క్ చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఘటనా స్థలిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. మరోవైపు మఖ్దూంభవన్‌పై దాడి ఘటనను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. చాడ వెంకట్ రెడ్డిని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫోన్‌లో పరామర్శించారు.