20 ఏళ్లుగా అనుమానంతో భార్యను వేధిస్తున్న భర్త.. కేవలం పక్కింటి వారితో మాట్లాడిందని ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని లంగర్ హౌస్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

అతడికి భార్యపై అనుమానం ఉంది. దీంతో ఆమెను ఎవరితో మాట్లాడినివ్వకపోయేవాడు. 20 సంవత్సరాలుగా ఆమెను ఇంట్లోనే బంధిస్తున్నాడు. చిత్ర హింసలు పెడుతున్నాడు. 20 ఏళ్లలో అనేక సార్లు ఇళ్లు మారుతూ వస్తున్నాడు. చివరికి లంగర్ హౌస్ ప్రాంతంలోని ఓ కాలనీలో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే అక్కడ తన భార్య పక్కింటి వారితో మాట్లాడిందని తెలుసుకొని దారుణంగా హత్య చేశాడు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్..? అర్ధరాత్రి వరకు సాగిన సీఎల్పీ సమావేశం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన జహంగీర్.. పంజగుట్ట కు చెందిన కనీజ్ బేగం కు 2004లో పెళ్లి జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. జహంగీర్ ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడు వివాహమైన కొంత కాలం నుంచే భార్యపై అనుమానం మొదలుపెట్టాడు. ఆమెను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. చివరికి ఆమెను తన తల్లితో కూడా మాట్లాడినివ్వకపోయేవాడు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

పని మీద అతడు బయటకు వెళ్లినప్పుడు బేగంను ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్లేవాడు. ఈ క్రమంలో అనేక సార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇంటి ఓనర్లు అతడిని హెచ్చరించడంతో ఇళ్లు మారిపోయేవాడు. 10 ఏళ్ల కిందట పెద్దగా గొడవ జరిగింది. దీంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు ఇద్దరినీ కూర్చోబెట్టి, జహంగీర్ కు చివాట్లు పెట్టారు. కనీజ్ ను మళ్లీ భర్తతో పంపించారు.

ఇళ్లు మారటం అలవాటుగా చేసుకున్న జహంగీర్ ఇటీవలే లంగర్‌హౌస్‌ బాగ్దాద్‌ కాలనీకి ఇంటిని అద్దెకు తీసుకొన్నాడు. ఫ్యామిలీని అందులోకి షిప్ట్ చేశాడు. ఐదు రోజుల కిందట ఎప్పటిలాగే పనికి వెళ్లి తిరిగి వచ్చాడు. చిన్న కూతురును పిలిచి తల్లి ఎవరితో మాట్లాడిందని అడిగాడు. పక్కింటి వాళ్లతో మాట్లాడిందని బాలిక బదులు ఇచ్చింది. దీంతో అతడు ఊగిపోయాడు. కనీజ్ ను తీవ్రంగా కొట్టాడు. మనస్థాపం చెందిన ఆమె.. పిల్లలను తీసుకొని తన సోదరుడు నివాసం ఉండే ఎండీలైన్స్‌ లోని ఇంటికి వెళ్లింది. 

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్, వ్యాన్ ఢీ.. 13 మంది మృతి.. ఎక్కడంటే ?

గత శనివారం సాయంత్రం బావ మరిది ఇంటికి గఫార్ వెళ్లాడు. ఇప్పటి నుంచి కలిసి మెలిసి ఉందామని నచ్చజెప్పాడు. అనంతరం పిల్లలను తన బావ మరిది ఇంట్లోనే ఉంచి, భార్యను మాత్రమే బాగ్దాద్‌ కాలనీలో ఉన్న ఇంటికి వచ్చారు. అయితే రాత్రి భోజనం అయిన తరువాత భార్యతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను హత్య చేశాడు. తరువాత లంగర్‌హౌస్‌ పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. చేసిన నేరాన్ని అంగీకరించి, లొంగిపోయాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. అధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.