Karimnagar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  క‌రీంన‌గ‌ర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి బండి సంజయ్ కుమార్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మం, అధర్మం మధ్య పోరు జరుగుతుందని అన్నారు. 

Karimnagar MP Bandi Sanjay Kumar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మం, అధర్మం మధ్య పోరు జరుగుతున్న‌ద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా క‌రీంన‌గ‌ర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. 

ధర్మం ప‌క్షాన నిలుస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు అనైతిక, అపవిత్ర పొత్తులు కుదుర్చుకున్నాయని ఆరోపించిన బండి సంజ‌య్.. వ‌చ్చే ఎన్నికల్లో ధర్మమే విజయం సాధిస్తుందని అన్నారు. బీజేపీకి మద్దతు కూడగట్టేందుకు పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని కవర్ చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవల్, శక్తి కేంద్ర కార్యకర్తలు పార్టీని జయప్రదం చేసేందుకు రానున్న 30 రోజుల్లో తమ ప్రయత్నాలను రెట్టింపు చేయాలని ఉద్ఘాటిస్తూ అట్టడుగు స్థాయి నుంచి కృషి అవసరమని తెలియజేశారు.

ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనను, దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పాలనను ప్రజలు భరించారని పేర్కొన్న ఆయ‌న‌.. వారి పాలనాపై ప్ర‌జ‌లు విసుగు చెందారని ఆరోపించారు. బీజేపీకి అవకాశం ఇవ్వాలనే ప్రజల సంకల్పాన్ని ఆయన ఎత్తిచూపారు. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ప్రజలతో మమేకం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ (వెనుకబడిన తరగతుల) అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ నేతలు అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. బీసీల సాధికారతపై వారికి ఉన్న విముఖతను ఇది తెలియజేస్తోందని విమ‌ర్శించారు.

అంతకుముందు సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బోనులో చిక్కుకుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు రహస్య ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ లోని తన కోవర్టులకు బీఆర్ఎస్ నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు, రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ లోటుపాట్లు, కాంగ్రెస్, ఎంఐఎం రాజకీయ వ్యూహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను బీజేపీ ఎంపీ కోరారు. కరీంనగర్ లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ బూత్ ఇన్ చార్జిలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు సహకరించాలని పిలుపునిచ్చారు.