తెలంగాణపై హస్తం నజర్.. హైదరాబాద్‌లో కాంగ్రెస్ తొలి వర్కింగ్ కమిటీ సమావేశం
Hyderabad: సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ తొలి వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది కార్యవర్గ సభ్యులు ఈ సమావేశం క్రమంలో రాష్ట్రానికి రానున్నారు.
Congress Working Committee Meeting: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అనేక కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. క్రమంలోనే మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. తెలంగాణపై ప్రత్యేక నజర్ పెట్టి గెలుపు వ్యూహాలతో ముందుకు సాగుతోంది. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ తొలి వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది కార్యవర్గ సభ్యులు ఈ సమావేశం క్రమంలో రాష్ట్రానికి రానున్నారు.
కాంగ్రెస్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారును సైతం టార్గెట్ చేసింది. దీని కోసం ఆ పార్టీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగనుంది. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (డబ్ల్యూసీసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
CWC కార్యవర్గం పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇది మొదటి సమావేశం. ఈ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించింది. ఈ భేటీతో రాష్ట్ర కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకుసాగే అవకాశముంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది కార్యవర్గ సభ్యులు రాష్ట్రానికి రానున్నారు. అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్ కు ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీలు సైతం ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతూ గెలుపు ధీమాను వ్యక్తంచేస్తున్నారు.