గ్రూప్-2 పరీక్షల వాయిదాకై టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఆందోళన: కోచింగ్ సెంటర్ల పాత్రపై అనుమానాలు

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ  అభ్యర్థుల ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర  ఉందని  పోలీసులు  అనుమానిస్తున్నారు.

Aspirants  Protest at TSPSC  Office:   Police  Plans to  File  Case  Against Coaching Centres lns

హైదరాబాద్: గ్రూప్-2  పరీక్షలు వాయిదా వేయాలని  కోరుతూ  అభ్యర్థుల ఆందోళన వెనుక  కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని  పోలీసు శాఖ అనుమానిస్తుంది. ఈ విషయమై కోచింగ్ సెంటర్లపై  కేసులు నమోదు చేయనున్నారు.గ్రూప్-2  పరీక్షలు వాయిదా వేయాలని  గురువారంనాడు అభ్యర్థులు ఆందోళనలు నిర్వహించారు.గంటపాటు మాత్రమే ఆందోళనకు  పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ నాలుగు గంటలకు  పైగా  ఆందోళన నిర్వహిస్తున్నారు  అభ్యర్థులు. పరీక్ష వాయిదా  వేసే  విషయమై  రెండు  రోజుల తర్వాత వెబ్ నోటిఫికేషన్ ఇస్తామని  టీఎస్‌పీఎస్‌సీ  అధికారులు ఆందోళనకారుల ప్రతినిధి బృందానికి  చెప్పారు.

also read:'గ్రూప్-2 పరీక్షల వాయిదాపై 48 గంటల తర్వాత స్పష్టత': కొనసాగుతున్న ఆందోళన

అయితే  ఈ విషయమై ఇవాళే స్పష్టత ఇవ్వాలని  ఆందోళనకారులు కోరుతున్నారు. ఈ ఆందోళన సమయంలో కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను పోలీసులు గుర్తించారని సమాచారం.  కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై  కేసులు నమోదు చేయాలని  పోలీసులు భావిస్తున్నారు.   ఈ ఆందోళన వెనుక  కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉందని  ఇంటలిజెన్స్ సమాచారం పోలీసులకు అందింది.  ఈ విషయమై  పోలీసులు  కేంద్రీకరించారు.

ఈ ఆందోళనకు  మద్దతిచ్చిన ఎన్ఎస్‌యూఐ  రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం నుండి  రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులను  పోలీసులు  చెదరగొట్టారు.   ఆందోళనకారులను  పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే సమీపంలోని రైల్వే స్టేషన్ వద్ద  గ్రూప్ -2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు.  వారిని  పోలీసులు అక్కడినుండి పంపారు.  ఆందోళన చేస్తున్నవారిిని పంపేందుకు  స్వల్ప లాఠీచార్జీ చేశారు  పోలీసులు . 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios