సిఫాబాద్ జిల్లాలో మూడేళ్ల క్రితం దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకంల రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు దోషులకు జిల్లా కోర్టు  విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు మార్చింది.

హైదరాబాద్‌: ఆసిఫాబాద్ జిల్లాలో మూడేళ్ల క్రితం దళిత మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకంల రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు దోషులకు జిల్లా కోర్టు విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు మార్చింది. అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరణశిక్ష విధించే అరుదైన నేరం కాదని.. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అయితే ఈ కేసులో జీవిత ఖైదు అంటే ఉపశమనం లేకుండా మరణించే వరకు జైలులో ఉండాల్సి ఉంటుందని పేర్కొంది. వివరాలు.. 2019 నవంబర్ 24న ఆసిఫాబాద్‌లో ఒక దళిత మహిళను ముగ్గురు వ్యక్తులు పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి, హత్య చేశారు. 

ఈ నేరానికి పాల్పడిన షేక్ బాబు, షేక్ షంషుద్దీన్, షేక్ మక్దూమ్‌‌ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. దాదాపు 20 రోజుల్లోనే చార్జిషీటు వేశారు. జిల్లా కోర్టు 45 రోజుల్లో విచారణను పూర్తి చేసి.. మహిళను నిర్జన ప్రదేశానికి లాగి అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి చంపినందుకు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్ మరియు షేక్ మక్దూమ్‌లను దోషులుగా నిర్ధారించింది. ఈ ముగ్గురిని హత్యానేరం కింద, అలాగే ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టంలోని నిబంధనల ప్రకారం మరణశిక్ష విధించింది. 

అయితే ఆ ముగ్గురు దాఖలు చేసిన అప్పీళ్లు, జిల్లా కోర్టు నుంచి వచ్చి రిట్ పిటిషన్‌ను హైకోర్టు సంయుక్తంగా విచారించింది. జస్టిస్ పి నవీన్ రావు, జస్టిస్ జె శ్రీదేవిలతో కూడా ధర్మాసనం ఈ విచారణ చేపట్టి.. ఈ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఉపశమనం లేకుండా మరణించే వరకు జైలులో ఉండాల్సి ఉంటుందని పేర్కొంది. జిల్లా కోర్టు తీర్పులోని చాలా భాగాలను నిలుపుదల చేస్తున్నామని, మరణశిక్షకు సంబంధించి విభేదిస్తున్నట్లు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

ఈ ముగ్గురూ ఘోరమైన నేరానికి పాల్పడ్డారు.. అందుకే వారిని సమాజానికి ముప్పుగా పరిణమిస్తూనే ఉంటారు.. కాబట్టి వారిని ప్రధాన స్రవంతి సమాజంలో తిరగనివ్వకూడదని ధర్మాసనం పేర్కొంది. మరణశిక్షను ‘కఠినమైన’ జీవిత ఖైదుగా మార్చవచ్చని ధర్మాసనం పేర్కొంది. ‘‘మహిళను చంపడానికి వారికి ముందస్తు ప్రణాళిక లేదు. ఆమెపై అత్యాచారం చేయడానికి వారు ఆమెను అనుసరించారు. తరువాత పరిణామాల నుండి తప్పించుకోవడానికి ఆమెను చంపారు’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ ఘటన సమాజంలోని వ్యక్తులు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసే హేయమైనది చర్య అని అనడంలో సందేహం లేదని తెలిపింది. ఎందుకంటే.. మరణించిన వ్యక్తి నష్టం ఆమె భర్త, పిల్లలకు కోలుకోలేనిదని పేర్కొంది. 

అయితే మరణశిక్షకు బదులు జీవిత ఖైదు వైపు మొగ్గు చూపడానికి కారణాలపై.. ‘‘కోర్టుకు మరణశిక్ష విధించడం మాత్రమే కోర్టుకు ఉన్న ఏకైక ఎంపిక కాదా అని చూడటానికి కోర్టు సాక్ష్యాధారాలను నిష్పాక్షికంగా పరిశీలించాలి లేదా భవిష్యత్తులో అలాంటి నేరాలకు పాల్పడకుండా ఇతరులను నిరోధించడానికి శిక్షను ఎంచుకోవచ్చు’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.