Asianet News TeluguAsianet News Telugu

డ్రంక్ అండ్ డ్రైవ్ లో గాయపడిన ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి

విధి నిర్వ‌హ‌ణ‌లో గాయ‌ప‌డిన కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 27న నిజాంపేట రోడ్‌లో ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి, హోంగార్డు క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్ వారిని ఢీకొట్టాడు.

asi mahipal reddy died who met an accident in drunk and drive checking in kphb - bsb
Author
Hyderabad, First Published Mar 31, 2021, 9:43 AM IST

విధి నిర్వ‌హ‌ణ‌లో గాయ‌ప‌డిన కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 27న నిజాంపేట రోడ్‌లో ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి, హోంగార్డు క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్ వారిని ఢీకొట్టాడు.

దీంతో ఏఎస్ఐ తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో ఆయ‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మ‌హిపాల్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఏఎస్ఐ నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

మద్యం సేవించి బండి నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్ డ్రైవ్ తనిఖీ డ్యూటీలో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీ కొట్టాడు. దీంతో వారిద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకుని వివరాలు సేకరిస్తున్న ఏఎస్ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్ ఢీ కొట్టాడు. దీంతో ఆయన రోడ్డు పక్కనే ఉన్న రాయిమీదికి ఎగిరిపడ్డాడు.

తల, కాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన మొత్తం కేపీహెచ్బీ ఠాణా పరిధిలో శనివారం అర్థరాత్రి జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్ రాఘవరెడ్డి గార్డెన్స్ దగ్గర్లో కేపీహెచ్ బీ లా అండ్ ఆర్డర్, కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. 

సుమారు 11.40గం.ల సమయంలో బాచుపల్లిక చెందిన సృజన్, పవన్ తో కలిసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్ ను పికప్ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్ 03 ఈజెడ్ 9119 నంబర్ గల క్రెటా వాహనంలో బయల్దేరారు. 

పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారని చూసి.. వారినుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్ రాజ్ కుమార్ వారి కారు దగ్గరికి వచ్చి ఆపాలని చెప్పాడు. దీంతో సృజన్ కారును వేగంగా రివర్స్ తీసుకునే ప్రయత్నం చేశాడు. 

ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్ తో పాటు తనూజ అనే మహిళను ఢీ కొట్టాడు. ఎస్ఐ సక్రమ్ అప్రమత్తమై గాయాలైన ప్రహ్లాద్, తనూజలను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన సృజన్ ను అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా 174గా నమోదు కావడం విశేషం. కారులో ఉన్న సృజన్ స్నేహితుడు అక్కడినుంచి పరారయ్యాడు. 

ఈ ఘటన విషయం తెలిసి నైట్ రౌండింగ్ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్ రెడ్డి ప్రమాద వివరాలను నోటు చేసుకుంటుండగానే అర్థరాత్రి 12.10 గంటలకు టీఎస్‌08 యూడీ 2984 నంబర్ గల క్యాబ్ ను అతి వేగంగా నడుపుతూ అటు వైపుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్ రెడ్డిని ఢీ కొట్టాడు. 

ఆయన ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న రాయి మీద పడడంతో కాలు, తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిపాల్ రెడ్డిని కొండాపూర్ లోని కిమ్స్ కు తరలించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆస్పత్రికి వెళ్లి మహిపాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన సృజన్, అస్లాం అలీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios