రోడ్డు ప్రమాదంలో మహిళా ఏఎస్ఐ మృతి (వీడియో)
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కూతురుకి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని రాజీవ్ రహదారి పై వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది.

"
దీంతో బైక్ పై ఉన్న మహిళ ఏఎస్ఐ భాగ్యలక్ష్మి (52) అక్కడికక్కడే మృతి చెందింది. పెద్దపల్లి పట్టణంలో చీకురాయి రొడ్డలో నివాసం ఉంటున్న తాడిచెట్టు భాగ్యలక్ష్మి కమాన్ పూర్ పోలీసుస్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తుంది.
భాగ్యలక్ష్మి విధి నిర్వహణలో భాగంగా పెద్దపల్లి కి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో కమాన్ చౌరస్తా వద్ద.. వెనుక నుండి వస్తున్న రాజస్తాన్ కు చెందిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఏఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందగా, తన కూతురుకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
అతి వేగంతో వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్త వలన ఈ ప్రమాదం జరిగిందని పలువురు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారీ కావడంతో పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.