హైదరాబాద్: ఆర్టీసీ టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డి, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ , కంటోన్మెంట్ కు చెందిన టీఆర్ఎస్ నేత కేశవరెడ్డిలు  బీజేపీలో చేరే అవకాశం ఉంది.ఈటల రాజేందర్ నివాసంలో గురువారం నాడు భోజనానికి హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్  తో ఆశ్వత్థామరెడ్డితో పాటు, రమేష్ రాథోడ్, కేశవరెడ్డిలు సమావేశమయ్యారు. ఈటల రాజేందర్ తో పాటు   వీరు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉంది. 

టీఎంయూ నేత ఆశ్వత్థామ రెడ్డి గత కొంతకాలంగా బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆర్టీసీ సమ్మె  తర్వాత ఆర్టీలో కార్మిక సంఘాలు ఉండొద్దని  సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. కార్మిక సంఘాల నేతలపై టీఆర్ఎస్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అప్పట్లో ఆరోపించారు. ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో  ఆర్టీసీలో కార్మిక సంఘాల్లో కేసీఆర్ కుటుంబసభ్యులు ఎలా తలదూర్చే ప్రయత్నం చేశారో విమర్శించారు. ఈ విషయమై ఆశ్వత్థామరెడ్డి  ఈటలపై ఫైర్ అయ్యారు.  కానీ ఇవాళ తరుణ్‌చుగ్ తో ఆశ్వత్థామరెడ్డి భేటీ అయ్యారు. 

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరనున్నారు. టీడీపీ నుండి ఆయన టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో కూడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. టీఆర్ఎస్ ను వీడి 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కు కూడ ఆయన గుడ్ బై  చెప్పి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. 

కంటోన్మెంట్ కు చెందిన టీఆర్ఎస్ నేత కేశవరెడ్డి కూడ బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. ఈ ముగ్గురు నేతలు ఈటల రాజేందర్ నివాసంలో  తరుణ్‌చుగ్ తో భేటీ అయ్యారు.