నటి సంజనపై అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ నేత ఆశిష్ గౌడ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం హైద్రాబాద్ పబ్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.

హైదరాబాద్: జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితుల నుండి సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ పోలీసులు అభిప్రాయపడ్డారు.ఈ మేరకు పది రోజుల పాటు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కస్టడీ పిటిషన్‌లో పోలీసులు పలు విషయాలను ప్రస్తావించారు.

Also read:రాజకీయ కుట్ర, వాస్తవం లేదు: సంజన ఫిర్యాదుపై ఆశిష్ గౌడ్

జస్టిష్ ఫర్ దిశ హత్య కేసులో నిందితుల నుండి సమగ్రమైన సమాచారం కోసం పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టును కోరారు. నిందితులను రిమాండ్‌కు తరలించే సమయంలో వేలాది మంది పోలీస్‌స్టేషన్‌కు రావడంతో ఈ కేసు విషయంలో సమగ్రంగా దర్యాప్తు చేయలేకపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కేసు విషయమై సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

ఈ కేసులో కీలకమైన మొబైల్ ఫోన్ ‌ ఇంకా స్వాధీనం చేసుకోలేకపోయినట్టుగా పోలీసులు చెప్పారు. నిందితులను సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉన్నందున వారిని తమ కస్టడీకి ఇవ్వాలని షాద్‌నగర్ పోలీసులు కోర్టును కోరారు. జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళ సంఘాలు, యువత కోరుతున్నారు.