Asianet News TeluguAsianet News Telugu

సీఎం సాబ్.. లాక్‌డౌన్ వద్దు: తెలుగులో అసదుద్దీన్ ట్వీట్లు, ఎంఐఎం చీఫ్‌పై ప్రశంసలు

రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపుపై తెలంగాణ కేబినెట్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించొద్దన్ని ప్రభుత్వాన్ని కోరారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

asaduddin owaisi telugu tweet on lock down ksp
Author
Hyderabad, First Published May 30, 2021, 2:17 PM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపుపై తెలంగాణ కేబినెట్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించొద్దన్ని ప్రభుత్వాన్ని కోరారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఆయన ఏమన్నారంటే.. ‘‘ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోంది. లాక్ డౌన్ పై నా వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నాను. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు. దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయి. లాక్ డౌన్ కంటే (12thMay) ముందే కోవిడ్ కేసులు తగ్గుతున్నట్లు ఇప్పటికే వివరాలు స్పష్టం చేస్తున్నాయి. లాక్ డౌన్ వల్లే కేసులు తగ్గలేదు. లాక్ డౌన్ లేకపోయినప్పటికీ కోవిడ్ ను ఎదుర్కోవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. మహమ్మారిపై సుధీర్ఘ పోరాటం చేయాలన్న వాస్తవాన్ని అందరమూ అంగీకరించాలి. మాస్కుల వినియోగం, భౌతికదూరంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారానే పోరాడవచ్చు. అందుకు అనుగుణమైన జీవనవిధానం ఉండేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలి.

మహమ్మారికి ధీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమే.లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. మహమ్మారి,పేదరికం,పోలీసుల వేధింపులతో చాలా ఇక్కట్లలో పడతారు. ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రభుత్వాలు శాంతి, భద్రతల సమస్యగా మారుస్తున్నాయి.ఇది ఎంత మాత్రం శాస్త్రీయ,మానవతా ధృక్పథం కాదు. లాక్ డౌన్ పొడిగించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాను. జనసమ్మర్దాన్ని తగ్గించాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నుంచి కర్ఫ్యూ విధించాలి లేదా కోవిడ్ క్లస్టర్లలో మినీ లాక్ డౌన్ విధించాలి. కానీ, కేవలం 4 గంటల సడలింపులతోనే 3.5 కోట్ల మంది జీవనం వారాల పాటు కొనసాగించాలని భావించడం తగదని ’’ అసదుద్దీన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios