Asianet News TeluguAsianet News Telugu

కారు స్టీరింగ్ నా చేతిలో ఉంటే అలా జరిగేదా..?: బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై అసదుద్దీన్ విమర్శలు..

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను మసీదు కూలగొట్టి నిర్మించారని.. స్టీరింగ్‌ తన చేతిలోనే ఉంటే అలా జరిగేదా అని ప్రశ్నించారు.

asaduddin owaisi slams BJP Over Car Steering remarks ksm
Author
First Published May 29, 2023, 1:53 PM IST

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను మసీదు కూలగొట్టి నిర్మించారని.. స్టీరింగ్‌ తన చేతిలోనే ఉంటే అలా జరిగేదా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారీ కారు (బీఆర్ఎస్ ప్రభుత్వ) స్టీరింగ్‌ ఒవైసీ చేతుల్లోనే ఉందని విమర్శలు చేస్తారని.. అలా అయితే మసీదును కూలగొట్టి మరీ సెక్రటేరియట్‌ నిర్మించారని ప్రశ్నించారు. స్టీరింగ్‌ తన చేతిలోనే ఉంటే అలా జరిగేదా అని ప్రశ్నించారు. కొత్త సెక్రటేరియట్ ఒవైసీ ఆనందం కోసమేనని  బీజేపీ నేతలు మాట్లాడుతారని.. అయితే తన చేతిలో స్టీరింగ్‌ ఉంటే సెక్రటేరియట్‌ను తాజ్‌మహల్‌ మాదిరిగా నిర్మించేవాడినని అన్నారు. తెలంగాణలో మజ్లిస్ పేరు జపించడమే బీజేపీ పనిగా  పెట్టుకుందని విమర్శించారు. 

కొత్త సెక్రటేరియట్‌ను గుజరాత్‌లోని ఓ మందిరం నిర్మాణం ఆధారంగా కట్టారని అసదుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం హిందువుల కోసమే అధికంగా ఖర్చు చేస్తుందని.. ముస్లింల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. గచ్చిబౌలిలో ఇస్లామిక్ సెంటర్‌ను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. మసీదు కూల్చిన చోట కొత్తది ఏర్పాటు చేయలేదని.. కానీ కొత్త సచివాలయం నిర్మాణం పూర్తైందని చెప్పారు. 

ముస్లింల అభివృద్దిపై ఏడ్చే నాయకులు.. వాళ్ల ఆస్తులు ఏమైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తాముంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది త్వరలోనే వెల్లడించనున్నట్టుగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios