కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సరైన దిశలోనే సాగుతోందని  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ  అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్‌తో పాటు తాము కూడ కలిసి వస్తామని ఎంఐఎం కూడ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సరైన దిశలోనే సాగుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్‌తో పాటు తాము కూడ కలిసి వస్తామని ఎంఐఎం కూడ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

మంగళవారం నాడు ఆయన ఫెడరల్ ప్రంట్‌పై స్పందించారు. ఈ ఫ్రంట్ ఏర్పాటు కోసమే కేరళ సీఎం విజయన్‌తో పాటు డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో కేసీఆర్ సమావేశమైనట్టుగా ఆయన గుర్తు చేశారు.

దేశ రాజకీయాల్లో మార్పు కోసం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు.ఈ మేరకు ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.