110 మంది బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయం.. : అమిత్ షాకు కేటీఆర్ కౌంటర్
Hyderabad: తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యమని బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. భారత్ లో తలసరి ఆదాయం 300 శాతానికి పైగా పెరిగిన రాష్ట్రం పేరు చెప్పాలనీ, అలాంటి బీజేపీ పాలిత లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని చూపించండి అంటూ కౌంటర్ ఇచ్చారు. ''అపూర్వమైన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ... తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించండి.. పదే పదే ఇక్కడికి రావడం, ప్రసంగాలు చేయడం, ప్రజలను మభ్యపెట్టడం పనికిరాదు'' అంటూ ఫైర్ అయ్యారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం పని చేయదనీ, ఈసారి నవంబర్ 30 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్లో 110 మందికి పైగా డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో జరిగిన జన గర్జన సభలో అమిత్ షా ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. భారత్ లో తలసరి ఆదాయం 300 శాతానికి పైగా పెరిగిన రాష్ట్రం పేరు చెప్పాలని అమిత్ షాను కోరుతున్నామన్నారు. అలాంటి బీజేపీ పాలిత లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని తమకు చూపించాలని డిమాండ్ చేశారు. అపూర్వమైన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ... తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించండి అంటూ వ్యాఖ్యానించారు.
పదేపదే ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. 'పదేపదే ఇక్కడకు వచ్చి ప్రసంగాలు చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం తెలంగాణలో పనికిరాదని' ఫైర్ అయ్యారు. '2018లో వారి (బీజేపీ) పార్టీ ఇదే పని చేసింది. 119 మంది అభ్యర్థుల్లో 108 మంది డిపాజిట్లు కోల్పోయారు. అమిత్ షా, నరేంద్ర మోడీ ఏం మాట్లాడినా తెలంగాణలో ఎవరూ సీరియస్ గా తీసుకోరు. మరోసారి 110 మందికి పైగా అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారు' అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎంఐఎం సూచనల మేరకే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించిన అమిత్ షా బీఆర్ ఎస్ కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లోనే ఉందన్నారు. 'ఆయన (కేసీఆర్) ఎన్నికల గుర్తు అంబాసిడర్ కారు. కానీ ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ వద్దే ఉంది' అని కేంద్ర హోం మంత్రి తెలిపారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. 'మా పార్టీ స్టీరింగ్ మా చేతుల్లో, కేసీఆర్ చేతుల్లోనే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ బీజేపీ పగ్గాలు అదానీ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని అమిత్ షా గమనించాలని' చురకలంటించారు.
తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అమిత్ షా అన్నారు. ఆదిలాబాద్ లోని ప్రతి గిరిజన యువకుడికి ఉపాధి, విద్య, రైతుల పొలాల్లో నీరు అందించడమే తమ లక్ష్యమని తెలంగాణ జన గర్జన సభ బహిరంగ సభలో అమిత్ షా అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తన దాడిని కొనసాగిస్తూనే మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకుంటున్నారా లేక కమలం ప్రభుత్వాన్ని (కమల్ కీ సర్కార్) తీసుకురావాలనుకుంటున్నారా అని ప్రజలను అమిత్ షా ప్రశ్నించారు. అయితే, తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందనీ, మూడో సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ అన్నారు. కాగా, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ తెలిపింది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొననుంది. అయితే, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 88 సీట్లు గెలుచుకుని 47.4 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ 19 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి 28.7 శాతం ఓట్లు వచ్చాయి.