లోన్ యాప్ కేసుల్లో ఈడీ దూకుడు: 230 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

లోన్ యాప్ కేసులో ఈడీ అధికారులు దూకుడును మరింత పెంచారు. చైనాకు చెందిన పలు లోన్ యాప్ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. 

Around 230 Loan APP  Bank Accounts Frozen By Enforcement Directorate

హైదరాబాద్: Loan APP  కేసులో Enforcement Directorate  అధికారులు దూకుడును పెంచారు. చైనాకు చెందిన లోన్ యాప్ లపై  ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో రూ. 103 కోట్ల నగదును ఈడీ ఫ్రీజ్ చేసింది.  ఇండిడ్రేడ్ ,పిన్ క్రాఫ్, ఆగ్లో ఫిన్ ట్రైడ్ తో పాటు ఫిన్ టెక్ కంపెనీల నగదు సీజ్ చేసింది ఈడీ. మరో వైపు 230 బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది.  ఇప్పటికే రూ. 819 కోట్లు ఫ్రీజ్ చేసింది ఈడీ. చైనా కంపెనీలు సుమారు రూ. 4300 కోట్లను లోన్ యాప్ ల రూపంలో తరలించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. 

ఆన్ లైన్ లోన్ యాప్ లపై  తొలుత Hyderabadలో పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ లోన్ యాప్ ల వెనుక చైనా కంపెనీలు ఉన్నాయని హైద్రాబాద్ పోలీసలు గుర్తించారు. దీంతో లోన్ యాప్ లను గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించాలని హైద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   221 యాప్‌లు చట్టవిరుద్ధమని; వాటిలో చాలా నకిలీవని తేలిందని పోలీసులు తెలిపారు.  లోన్ యాప్ కేసుల్లో గతంలో కూడా కొన్ని సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.మనీ లాండరింగ్ కింద కేసులు కూడా నమోదు చేసింది.  లోన్  యాప్ నిర్వాహకుల ఖాతాల్లోని రూ.6.18 కోట్లు ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన అటాచ్ చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకొన్న ఘటనలు కూడా చోటు చేసుకొన్నాయి. ఈ లోన్ యాప్ లకు వ్యతిరేకంగా కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయలేక ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు.ఇటీవల ఏపీ రాష్ట్రంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా లోన్ యాప్ ఏజంట్లు వేధింపులకు గురి చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ ను కూడా వేధింపులకు గురి చేశారు. ఫోన్ చేసి పలానా వాళ్లు మీ ఫోన్ నెంబర్లు ఇచ్చారు వారు డబ్బులు తీసుకొన్నందున వారు తీసుకున్న డబ్బులను మీరు చెల్లించాలని  వేధించారు. హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన రాజ్‌కుమార్ ఆన్‌లైన్ లోన్ యాప్‌లో రూ. 12 వేలు అప్పు తీసుకున్నాడు. అయితే లోన్ సమయంలో రిఫరెన్స్‌గా స్నేహితుల ఫోన్ నెంబర్లను ఇచ్చాడు. తీసుకున్న రుణానికి సంబంధించి.. ఈఎంఐ ద్వారా 4 నెలలు చెల్లింపులు చేశాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios