ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం: ఈ జవాన్ ఇలాంటి ఘాతుకాలెన్నో...

Army jawan Brijesh kumar arrested for rape case in Hyderabad
Highlights

ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను లక్ష్యంగా  చేసుకొని ప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఆర్మీ జవాన్  బ్రిజేష్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్: ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను లక్ష్యంగా  చేసుకొని ప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఆర్మీ జవాన్  బ్రిజేష్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  సికింద్రాబాద్‌ తిరుమలగిరి ప్రాంతంలో మంగళవారం నాడు బ్రిజేష్‌కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  బ్రిజేష్‌ను విచారిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

సికింద్రాబాద్‌ తిరుమలగిరి ప్రాంతంలోని నిర్మానుష్యంగా ప్రాంతాల్లో ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని ఆర్మీ జవాన్ బ్రిజేష్ కుమార్ దాడులకు పాల్పడేవాడు. నిర్మానుష్యప్రాంతాల్లో ఏకాంతం కోసం వచ్చే ప్రేమ జంటలపై బ్రిజేష్ కుమార్ దాడులకు పాల్పడేవాడు.

మంగళవారం నాడు కూడ ఓ ప్రేమ జంట ఏకాంతం కోసం తిరుమలగిరి ప్రాంతంలోని నిర్మానుష్యప్రాంతానికి  వచ్చింది.ఈ విషయాన్ని గమనించిన బ్రిజేష్ కుమార్  ఆ ప్రేమ జంట వద్దకు వచ్చాడు. ఎందుకు ఇక్కడికి వచ్చారని నిలదీశారు. మాట్లాడుతూనే  ప్రియుడిపై దాడి చేశాడు. దీంతో ప్రియుడి పళ్లు ఊడిపోయాయి. ప్రియుడిని నిందితుడు గాయపర్చాడు.

ఆ తర్వాత ప్రియురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో బాధితురాలు  చాకచక్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు  సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొన్నారు.  అయితే పోలీసులను చూసిన ఆర్మీ జవాన్  బ్రిజేష్ కుమార్  పారిపోయాడు. అయితే  అతడిని వెంటాడి పోలీసులు పట్టుకొన్నారు.

బ్రిజేష్ కుమార్ ఆర్మీలో పనిచేస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే గత నాలుగు మాసాల క్రితం ఇదే ప్రాంతంలో పదో తరగతి విద్యార్ధినిపై కూడ బ్రిజేష్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల గురించి పోలీసులు  అన్వేషిస్తున్నారు. కానీ, ఇంతవరకు నిందితులు దొరకలేదు. 

అయితే మంగళవారం నాడు బ్రిజేష్ కుమార్ డిఎన్ఏ శాంపిల్స్‌ను  సేకరించారు. నాలుగు మాసాల క్రితం పదో తరగతి విద్యార్ధినిపై  అత్యాచారానికి పాల్పడిన సమయంలో దొరికిన వీర్యంతో బ్రిజేష్ కుమార్ వీర్యం నమూనాలను  సరిపోయాయి.

అయితే ఈ రెండు ఘటనలే కాకుండా ఇంకా  పలువురిపై  బ్రిజేష్ కుమార్  దాడులకు పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఏకాంతం కోసం వచ్చే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని ప్రియుడిపై దాడికి దిగి ఆ తర్వాత అతడి ఎదుటే లవర్‌పై అత్యాచారానికి దిగేవాడని  పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

 


 

loader