హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖుషీ‌నగర్‌లో  జరిగిన పేలుళ్లకు సంబంధించిన హైద్రాబాద్‌‌ ఆర్మీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌కు లింకులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. యూపీ రాష్ట్రానికి చెందిన ఏటీఎస్ పోలీసులు హైద్రాబాద్‌లో ఆర్మీ కెప్టెన్ ఆశ్వక్‌ను అరెస్ట్ చేశారు.

యూపీలోని ఖుషీ‌నగర్ పేలుళ్లకు హైద్రాబాద్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఆశ్వక్‌కు లింకులు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుళ్ల సమయంలో ఆశ్వక్ అక్కడే ఉన్నాడు. పేలుళ్ల సమయంలో  ఆర్మీ కెప్టెన్  ఆశ్వక్ అక్కడే ఉన్నాడు. పేలుళ్లు  జరిగిన తర్వాత ఆశ్వక్ అక్కడే ఉన్నాడు. పేలుళ్లు జరిగిన తర్వాత  ఆశ్వక్  అక్కడి నుండి నేరుగా హైద్రాబాద్‌కు వచ్చినట్టుగా పోలీసులు  గుర్తించారు.

పేలుళ్ల ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేసినట్టుగా యూపీ పోలీసులు అనుమానిస్తున్నారు. హైద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రిలో ఆశ్వక్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. సాక్ష్యాలను తారుమారు చేసినట్టుగా  యూపీ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పేలుళ్ల ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ కెప్టెన్ ఆశ్వక్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసి పోలీసులు యూపీకి తరలించారు. ఆశ్వక్ తాత నిర్వహిస్తున్న మసీదులో  ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ పేలుడు తర్వాత ఆశ్వక్ హైద్రాబాద్‌కు వచ్చారు.