ఫణిగిరిలో మరో అద్భుతం...బయటపడ్డ అరుదైన శిల్పసంపద (వీడియో)
తెలంగాణలో చారిత్రక ప్రాంతంగా పేరుగాంచిన సూర్యాపేట జిల్లా ఫణిగిరి ప్రాంతంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. ఇప్పటికే ప్రముఖ బుద్దస్థూపానికి కేంద్రంగా పేరుగాంచిన ఇక్కడ అనేక చారిత్రక ఆనవాళ్ళు భయపడ్డ విషయం తెలిసిందే. తాజాగా క్రీ,పూ ఒకటవ శతాబ్దానికి చెందిన భారీ బుద్ద విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి.
తెలంగాణలో చారిత్రక ప్రాంతంగా పేరుగాంచిన సూర్యాపేట జిల్లా ఫణిగిరి ప్రాంతంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. ఇప్పటికే ప్రముఖ బుద్దస్థూపానికి కేంద్రంగా పేరుగాంచిన ఇక్కడ అనేక చారిత్రక ఆనవాళ్ళు భయపడ్డ విషయం తెలిసిందే. తాజాగా క్రీ,పూ ఒకటవ శతాబ్దానికి చెందిన భారీ బుద్ద విగ్రహాలు ఇక్కడ బయటపడ్డాయి.
దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా వెలుగుచూడని అద్భుతమైన బుద్ద విగ్రహం ఫణిగిరిలో పురావస్తు శాఖ తవ్వకాల్లో భయటపడింది. డంగు సున్నం తో చేసిన దాదాపు ఆరు అడుగుల బుద్ద విగ్రహాన్ని గుర్తించిన పురావస్తు శాఖ దాన్ని భయటకు తీసి హైదరాబాద్ లోని పురావస్తూ శాఖ కార్యలయంలోని మ్యూజియానికి తరలించారు. అక్కడ భద్రపర్చిన ఈ విగ్రహాన్ని తాజాగా రాష్ట్ర పురావస్తూ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.
ఈ సందర్శంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో చరిత్ర వుందని ఇలాంటి చారిత్రక ఆనవాళ్లు భయటపెడుతున్నాయని అన్నారు. ఆది మానవుని అవశేషాలు ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా చోట్ల వెలుగు చూసాయన్నారు. ఉమ్మడి పాలనలో మన చారిత్రక ఆనవాళ్లు కూడా నాశనమయ్యాయని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అందించిన ప్రోత్సాహంతో పురావస్తూ శాఖ బాగా పనిచేస్తోందన్నారు. వీరు తెలంగాణలోని పలు చారిత్రక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి చారిత్రక అవశేషాలను వెలికితీయటం అభినందనీయమన్నారు. బౌద్ద క్షేత్రమైన ఫణిగిరి లో లభ్యమైన ఈ ప్రతిమ ఎంతో అమూల్యమైందన్నారు.
దేశంలో ఇప్పటివరకు రెండు అడుగుల పరిమాణంలో ఉండే సున్నం ప్రతిమలు లబించాయని...కానీ ఇలామ అరు అడుగుల పోడవున్న ప్రతిమ లభించడం ఇదే తొలిసారన్నారు. సహజంగా దొరికే డంగు సున్నంతో రూపోందించిన ఈ ప్రతిమ క్రీ.పూ 1వ శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ అరుదైన బుద్దుడి ప్రతిమను జాగ్రత్తగా సంరక్షించాలని మంత్రి పురావస్తూ అధికారులను మంత్రి అదేశించారు.
వీడియో
"