తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభ ఈనెల 29న హైదరాబాద్ లో జరగనుంది. ఈ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్కారు నో చెప్పినా.. కోర్టు నుంచి  కోదండరాం అండ్ టీం అనుమతులు తెచ్చుకున్నారు.

29న హైదరాబాద్ లో జరగనున్న సభకు వచ్చే వారికి కోదండరాం ఒక పిలుపునిచ్చారు. అదేమంటే? ఊరుకో నాగ‌లి కర్రు తీసుకుని రావాలని పార్టీ నేతలకు, తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు.

ఆవిర్బావ స‌భ‌కు ప్ర‌తి గ్రామం నుండి నాగ‌లి క‌ర్రు లేకపోతే పార లేక తట్ట లేక చెమ్మాస్ ముక్కుతో త‌ర‌లిరావాలని పిలుపునిచ్చారు. వీటితో అమ‌ర వీరుల స్తూపం నిర్మాణం జ‌రుగుతుందని ఆయన ప్రకటించారు. స‌భ‌కు వ‌చ్చే ప్ర‌తి గ్రామం నుండి విధిగా నాగ‌లి క‌ర్రు తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నామన్నారు.

ఇంకో ముచ్చటేందంటే? జన స‌మితి స‌భ‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ పూల దండ‌లు, బొకేలు, జ్ఞాపిక‌లు తేవ‌ద్దని కోరారు. అలాగే స‌భ వేదిక‌పై నాయ‌కుల చేరిక‌లూ ఉండ‌బోవన్నారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి విధిగా ఈ సూచ‌న‌లు పాటించాల్సిందిగా కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.