రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంకెంతమందికి మూడనుందో...

గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నియమించిన కార్పొరేషన్ల చైర్మన్లు, నామినేటెడ్ పదవులకు మంగళం పాడారు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏకకాలంలో 54మందికి ఉద్వాసన పలికారు. 

Appointments of corporation chairmans cancelled by cm Revanth Reddy in Telangana - bsb

తెలంగాణలో ఎన్నికల తరువాత రాజకీయపరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వంలో ఊహించిన మార్పులతో పాటు.. ఊహించని మార్పులు అనేకం శరవేగంగా జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా తమ అనుకూల వర్గాలను పాలనలోకి తీసుకోవడం మామూలే. అలాగే అంతకుముందున్న ప్రభుత్వానికి చెందిన వారు రాజీనామాలూ కామనే. కానీ ఈ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అధికారం కాంగ్రెస్ హస్తగతం అయిన తరువాత ఈ రాజీనామాలు, హూస్టింగులు షాకింగ్ గా ఉన్నాయి. 

మొదట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగోతేదీనుండి రాజీనామాల పర్వం మొదలయ్యింది. ఇంటలిజెన్స్ లో ఓఎస్‌డీగా పనిచేస్తున్న ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ లో ఓఎస్‌డీ పనిచేస్తున్న రాధాకిషన్ రావులు నాలుగో తేదీన మొదట రిజైన్ చేసి రాజీనామాలకు శ్రీకారం చుట్టారు. వీరిద్దరూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ వారిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టినవారే. కాంగ్రెస్ నేతలపై నిఘా పెట్టినవారే, వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారని వీరిమీద ఆరోపణలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముందుగా వీరిద్దరూ సర్దుకున్నారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... వారి జీవితాలపై దెబ్బే..: ఆర్ఎస్ ప్రవీణ్

ఆ తరువాత ట్రాన్స్ కో, జెన్ కో ఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ లు రాజీనామా చేశారు. వీరి తరువాత మరో 18 మంది కార్మొరేషన్ చైర్మన్లు వీరి బాటలోనే నడిచి రాజీనామాలు సమర్పించారు. 4వ తేదీనే పెద్ద ఎత్తున రాజీనామాలు అందాయి. ఇదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని కూడా గుసగుసలు వినిపించాయి. 

అప్పటికి ఇంకా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగలేదు. వీరంతా తమ రాజీనామాలు సీఎస్ శాంతికుమారికి సమర్పించారు. డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, మంత్రివర్గ ఏర్పాటు తరువాత వెంటనే కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రగతిభవన్ ను ప్రజాభవన్ గా మార్చడం, ప్రజా దర్బార్ నిర్వహించడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు వెంటవెంటనే అమల్లోకి వచ్చాయి. 

తాజాగా ఆదివారం డిసెంబర్ 10వ తేదీన 54మంది కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మీడియా అకాడమీ, ఉన్నత విద్యామండలి, నామినేటెడ్ చైర్మన్ల పోస్టులను కలిపి ఒకేసారి మూకుమ్మడిగా తొలగించారు. వీరితో పాటు వీరు నియమించుకున్న వ్యక్తిగత సిబ్బందిని కూడా తొలగించారు. 

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల పేషీల్లో ఉన్న పీఏలు, పీఎస్ లు, ఓఎస్డీలుగా ఉన్నవారు, ప్రభుత్వోద్యోగులు, ఆఫీసర్ల డిప్యుటేషన్లు రద్దు చేశారు. వారంతా ఎవరి శాఖలకు వారు వెళ్లిపోవాల్సిందే. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఓ జీవో జారీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను రద్దు చేయడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. 

ఈ కార్పొరేషన్ చైర్మన్లలో కొంతమందికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ముందు రోజు పదవులు ఇచ్చారు. అలా ఇచ్చిన వారినలో రైతుబంధు సమితి చైర్మన్ తాటికొం రాజయ్య, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు ఉన్నారు. ఇక తాజాగా తొలగించినవారిలో కొంతమంది సుదీర్ఘ కాలం పదవుల్లో ఉన్నవారు ఉన్నారు. సాధారణంగా కార్పొరేషన్ చైర్మన్ పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. కానీ ప్రభుత్వంతో తమకున్న అనుబంధాన్ని బట్టి ఆ పదవీకాలం పొడగించుకుంటూ వచ్చినవారున్నారు. అలా 2017నుంచి ఉన్నవారు కూడా ఇప్పుడు రద్దైన జాబితాలో ఉన్నారు. 

దీంతో ఇన్నేళుగా అధికారపక్షానికి అంటకాగిన ప్రభుత్వాధికారుల్లో ఇప్పడు గుబులు మొదలయ్యింది. ఎప్పుడు తమ మీద వేటు పడుతుందో అని బితుకు బితుకు మంటున్నారు. ఎప్పుడు హూస్టింగ్ కత్తి తమ ఉద్యోగం మీద పడుతుందో తెలియక గందరగోళ పడుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios