Asianet News TeluguAsianet News Telugu

సాయి ధరమ్‌ తేజ్‌: సర్జరీ సక్సెస్, అబ్జర్వేషన్ లో 24 గంటలు


సినీ నటుడు సాయిధరమ్ తేజ్ కి కాలర్ బోన్ శస్త్రచికిత్స నిర్వహించారు. గంటకు పైగా అపోలో ఆసుపత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిపై ఆటోను తప్పించబోయిన సాయిధరమ్ తేజ్ బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు.దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. 

Apollo doctors completes collar bone surgery to Tollywood cine actor  sai dharam tej
Author
Hyderabad, First Published Sep 12, 2021, 1:31 PM IST

హైదరాబాద్: సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కి కాలర్ బోన్ శస్త్రచికిత్స విజయవంతమైందని అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.  ఈ మేరకు  ఇవాళ అపోలో ఆసుపత్రి సాయిధరమ్ తేజ్ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

also read:సినీ నటుడు సాయిధరమ్ తేజ్‌కి ప్రమాదం: తొలుత గుర్తించింది ఇతనే....

 మరో 24 గంటలపాటు సాయిధరమ్ తేజ్ ను అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు తెలిపారు.  డాక్టర్ ఆలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్యుల బృందం సాయిధరమ్ తేజ్ కి ఆపరేషన్ నిర్వహించింది. ఆపరేషన్ పూర్తైన తర్వాత  సాయిధరమ్ తేజ్ ని ఐసీయూలోకి తరలించారు.  తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ నెల 10వ తేదీ రాత్రి దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిపై ఆటోను తప్పించబోయిన సాయిధరమ్ తేజ్ బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు.దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అక్కడే ఉన్న కొందరు స్థానికులు గుర్తించి 108కి ఫోన్ చేశారు. దీంతో మాదాపూర్ సమీపంలోని ఓ రోగిని ఆసుపత్రిలో చేర్పించి తిరిగి వెళ్తున్న 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios