Asianet News TeluguAsianet News Telugu

హెచ్‌సీఏలోకి కొత్త సభ్యులు.. ఏ అధికారంతో చేశారు, పిచ్చిపట్టిందా: అజార్‌‌పై అపెక్స్‌ కౌన్సిల్ ఆగ్రహం

హెచ్‌సీఏలో మరో వివాదానికి తెర లేపారు మహమ్మద్ అజారుద్దీన్. అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసినా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏజీఎంలో ఆరుగురికి చోటిచ్చిన అజారుద్దీన్ .. జిల్లాల కోటాలో వారికి సభ్యత్వం ఇచ్చారు. 

apex council serious on mohammad azharuddin ksp
Author
hyderabad, First Published Jun 19, 2021, 7:28 PM IST

హెచ్‌సీఏలో మరో వివాదానికి తెర లేపారు మహమ్మద్ అజారుద్దీన్. అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసినా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఏజీఎంలో ఆరుగురికి చోటిచ్చిన అజారుద్దీన్ .. జిల్లాల కోటాలో వారికి సభ్యత్వం ఇచ్చారు. అయితే ఏ హోదాలో అజార్ వారిని నియమించారని  ప్రశ్నిస్తోంది అపెక్స్ కౌన్సిల్ .

అజార్‌కు పిచ్చి పట్టిందంటూ మాజీ సెక్రటరీ శేష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అపెక్స్ కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యులు అజార్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని.. సస్పెండ్ అయిన అజారుద్దీన్ ఎలా నియామకాలు చేస్తారని నారాయణ ప్రశ్నిస్తున్నారు. గత మూడేళ్లలో బీసీసీఐ ద్వారా హెచ్‌సీఏకు రూ.45 కోట్లు వచ్చాయన్న శేష్ నారాయణ్... ఆ లెక్కలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 

Also Read:హెచ్‌సీఏ సభ్యుల పెంపు.. కొత్త జిల్లాల నుంచి ఆరుగురికి అవకాశం: అజారుద్దీన్ కీలక నిర్ణయం

అంతకుముందు తెలంగాణలో క్రికెట్‌ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్‌సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచారు. అన్ని జిల్లాల్లో యువ క్రీడాకారులను ప్రోత్సహించనున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి ఆరుగురికి హెచ్‌సీఏ సభ్యత్వం కల్పించారు. జిల్లా కోటాలో వాలా శరత్ చంద్ర, మఠం బిక్షపతి, బుద్ధుల శ్రవణ్ రెడ్డి, దాదాన్నగిరి సందీప్ కుమార్, దావా సురేశ్, మల్లిఖార్జున్‌లను హెచ్‌సీఏ ఎంజీఎం సభ్యులుగా చేరుస్తున్నట్లు అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు. వీరిని జిల్లాల అడహక్ కార్యదర్శులుగా నియమిస్తూ హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios