ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల ప్రియ.. తనకు కాబోయే భర్త భార్గవ్ సమేతంగా.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిశారు. తమ వివాహానికి రావాల్సిందిగా..అఖిల ప్రియ.. కేటీఆర్ ని కోరారు.
ఇటీవల అఖిల ప్రియ, భార్గవ్ ల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుని అఖిల ప్రియ ఆహ్వానించగా.. తాజాగా కేటీఆర్ కి తమ లగ్న పత్రిక
అందజేసి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా కాబోయే దంపతులు అఖిలప్రియ, భార్గవ్‌ను కేటీఆర్ అభినందించారు.  ఉమ్మడి రాష్ట్రంలో తాను, శోభానాగిరెడ్డి ఎమ్మెల్యేలుగా పనిచేశామని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 
ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.