Asianet News TeluguAsianet News Telugu

జల వివాదంపై హైకోర్టుకి ఏపీ రైతులు: తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ  జల విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని నిరసిస్తూ ఏపీకి చెందిన రైతులు తెలంగాణ హైకోర్టులో ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

AP farmers filed petition in Telangana High court over water dispute lns
Author
Hyderabad, First Published Jul 4, 2021, 10:47 AM IST


హైదరాబాద్: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ  జల విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని నిరసిస్తూ ఏపీకి చెందిన రైతులు తెలంగాణ హైకోర్టులో ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని  ఏపీ ప్రభుత్వం తెలంగాణపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై తెలంగాణ కూడ ఘాటుగానే స్పందించింది. ఏపీ వాదనను తిప్పికొడుతూ తమ వాదనను విన్పించింది.

also read:జల విద్యుదుత్పత్తిపై జగన్ లేఖ ఎఫెక్ట్: తెలంగాణకు బిగ్ షాక్, 7న భేటీ

ఇదే సమయంలో ఏపీకి చెందిన రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని  ఏపీకి చెందిన రైతులు హైకోర్టును కోరారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీరు విడుదల చేయడం వల్ల వృధాగా నీరు సముద్రంలో కలుస్తోందని రైతులు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు రాష్ట్రాల పోలీసులను మోహరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios