Asianet News TeluguAsianet News Telugu

జల విద్యుదుత్పత్తిపై జగన్ లేఖ ఎఫెక్ట్: తెలంగాణకు బిగ్ షాక్, 7న భేటీ

 శ్రీశైలం ఎడమగట్టు  జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి లేఖ రాసింది.

KRMB meeting willbe held on july 7 lns
Author
Hyderabad, First Published Jul 2, 2021, 10:20 AM IST

హైదరాబాద్:  శ్రీశైలం ఎడమగట్టు  జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి లేఖ రాసింది.శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి రెండు దఫాలు లేఖలు రాసింది. మొదటి లేఖ రాసిన సమయంలోనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ తెలంగాణను ఆదేశించింది.  ఇదే విషయమై ఏపీ ప్రభుత్వం మరో లేఖను కూడ కేఆర్ఎంబీకి రాసింది.

also read:జలవివాదంపై ఏపీ ఫిర్యాదులు: తెలంగాణకు షాక్.. ఆ నీటిని మినహాయిస్తూ కేఆర్ఎంబీ ఆదేశాలు

ఇదిలా ఉంటే  విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి లేఖ రాసింది.  ప్రస్తుతం జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా ఉపయోగించిన నీటిని రాష్ట్రానికి కేటాయించిన వాటా నుండి తగ్గించుకోవాలని కేఆర్ఎంబీ తెలంగాణకు సూచించింది. ఈ నెల 7వ తేదీన కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios