కేసీఆర్‌కి షాక్: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎన్జీటీలో ఏపీ రైతుల పిటిషన్, కమిటీ


పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులను గత అనుమతులతోనే నిర్వహిస్తోందని   ఎన్జీటీలో ఏపీకి చెందిన రైతులు ఇవాళ పిటిషన్  దాఖలు చేశారు. పర్యావరణ అనుమతతు తీసుకొనే వరకు తాగునీటికే పరిమితం చేయాలని కోరారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఎన్జీటీ కమిటీని ఏర్పాటు చేసింది.

AP farmers filed petition against palamuru rangareddy project lns


అమరావతి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. పాలమూరు రంగారెడ్డి లిప్ట్  ప్రాజెక్టుపై ఏపీకి చెందిన రైతులు  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయమై పనుల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జీటీ.పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీలోని రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు.

also read:ప్రత్యామ్నాయం లేకే సుప్రీంకోర్టుకు: నదీజలాల వివాదంపై కేంద్ర జలవనరుల కార్యదర్శికి ఏపీ సీఎస్ లేఖ

పాత అనుమతులతోనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ను నిర్మిస్తోందని ఆ పిటిషన్ లో  రైతులు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకొనే వరకు తాగు నీటి అవసరాల కోసమే పరిమితం చేయాలని రైతులు కోరారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చే వరకు  తాగు నీటి అవసరాల కోసమే పరిమితం చేయాలని రైతులు కోరారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం పనుల పరిశీలన కోసం  ఓ కమిటీని ఏర్పాటు చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్,  ఆర్డీఎస్ కుడికాలువలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios