హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్‌ ఆక్రమించిన పార్క్‌ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ  కూల్చివేసింది. 

హైదరాబాదులోని ప్రశాసన్‌ నగర్‌లో తన ఇంటికి ఆనుకొన్ని ఉన్న పార్క్‌ స్థలాన్ని ఆక్రమించడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్‌ వేశారు. 

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో జీహెచ్ఎంసి రంగంలోకి దిగి దాన్ని కూల్చేసింది.