Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రచారం:రఘువీరా

 తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు సైతం పాల్గొంటారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి తెలంగాణలో ప్రజాకూటమి గెలవాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు తాము కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 
 

ap congress leaders will participate in telangana assembly election campaign
Author
Amaravathi, First Published Dec 1, 2018, 4:09 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలు సైతం పాల్గొంటారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి తెలంగాణలో ప్రజాకూటమి గెలవాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు తాము కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 

పాలనా పరంగా రాష్ట్రాలు మాత్రమే వేరు..కానీ తెలుగువాళ్ళంతా ఒక్కటే అని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలను బీజేపీ నెరవేర్చలేదని రఘువీరారెడ్డి విమర్శించారు.

మరోవైపు  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎస్టీలకు కాంగ్రెస్ 10శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతుందని అలాగే ప్రతీ ఉద్యోగాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుందని రఘువీరా తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభజన హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

షాక్ తిన్నా: రాహుల్ తో చంద్రబాబు భేటీపై రఘువీరా

Follow Us:
Download App:
  • android
  • ios