Asianet News TeluguAsianet News Telugu

మార్గదర్శి చిట్ ఫండ్ కేసు.. ఎండీ శైలజాకిరణ్ కు ఏపీ సీఐడీ నోటీసులు..

మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్ళింపు కేసులో విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ ఎండీ శైలజాకిరణ్ కు నోటీసులు జారీ చేసింది.

AP CID notices to MD Sailajakiran In Margadarshi chit fund case - bsb
Author
First Published Mar 28, 2023, 10:55 AM IST

విజయవాడ : మార్గదర్శి ఎండి చెరుకూరి శైలజా కిరణ్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏపీ సిఐడి మార్గదర్శి చిట్ఫండ్ నిధుల మళ్లింపు, అక్రమాల కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి ఎన్ డికి నోటీసులు జారీ చేశారని  తెలిసింది. ఈ కేసులో సిఐడి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఏవన్ గా.. ఏటుగా మార్గదర్శి ఎండి, రామోజీరావు కోడలు శైలజను పేర్కొన్న సంగతి తెలిసిందే. సిఐడి డిఎస్పి రవికుమార్ నోటీసులు జారీ చేస్తూ విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల మీద ఏటూగా ఉన్న చెరుకూరి శైలజకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమె మీద వచ్చిన ఆరోపణలకు విచారించాలని ఆ నోటీసుల్లో సిఐడి పేర్కొంది. ఈనెల 29, 31వ తేదీల్లో హాజరుకావాలని… లేకుంటే ఏప్రిల్ 3,6వ తేదీల్లో అందుబాటులో ఉండాలని నోటీసులలో సిఐడి పేర్కొంది. ఆఫీస్ లేదా ఇంట్లో  విచారణకు అందుబాటులో ఉండాలని.. అది సరిపోతుందని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios