ఎన్‌టీఆర్, వైఎస్ బాటలోనే:తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం

తెలంగాణ ముఖ్యమంత్రిగా  అనుముల రేవంత్ రెడ్డి  ఇవాళ ప్రమాణం చేశారు.  లాల్ బహదూర్ స్టేడియంలో రేవంత్ రెడ్డితో  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.  

Anumula Revanth Reddy takes oath as Telangana Chief Minister lns

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా  అనుముల రేవంత్ రెడ్డి గురువారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు.   రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించారు.  గురువారంనాడు  ఎల్ బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితో  సీఎంగా ప్రమాణం చేయించారు  గవర్నర్. రేవంత్ రెడ్డితో పాటు  11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  ఈ ఏడాది  నవంబర్  30 పోలింగ్ జరిగింది.  ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన  64 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు.  భారత రాష్ట్ర సమితి  39 స్థానాలకు మాత్రమే  పరిమితమైంది.బీజేపీ  ఎనిమిది, ఎంఐఎం ఏడు, సీపీఐ ఒక్క స్థానానికి పరిమితమైంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  నందమూరి తారకరామారావు,  వై,ఎస్.రాజశేఖర్ రెడ్డి  బాటలోనే  లాల్ బహదూర్ స్టేడియంలో  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ ఇద్దరూ నేతలు  ముఖ్యమంత్రులుగా ప్రజల మధ్యే ప్రమాణం చేశారు.  అదే దారిలో రేవంత్  రెడ్డి పయనించారు.ఇవాళ ఎల్ బీ స్టేడియంలో  ముఖ్యమంత్రిగా  ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారోత్సవానికి  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు.  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తొలుత రేవంత్ రెడ్డి  ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి తర్వాత మల్లు భట్టి విక్రమార్క, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క,తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios