హైదరాబాద్:హైదరాబాద్ లోని హయత్‌నగర్ లో తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన కీర్తి కేసులో అసలు విషయాలను పోలీసులు వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిని హత్య చేసేందుకు కీర్తీకి ప్రియుడు శశికుమార్ నూరిపోసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.మృతదేహాన్ని తరలించేందుకు కీర్తి, శశితో పాటు మరోకరు కూడ ఉన్నారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి

ఈ నెల 19వ తేదీన కూరగాయలు తీసుకొచ్చేందుకు రజిత మార్కెట్ కు వెళ్లింది. ఆ సమయంలోనే కీర్తి ప్రియుడు శశి కీర్తి వద్దకు వచ్చాడు.  కూరగాయల మార్కెట్ వద్ద నుండి ఇంటికి వచ్చిన రజిత కూతురితో శశి సన్నిహితంగా ఉండడాన్ని చూసింది.  శశిని తిట్టింది. మళ్లీ కీర్తీతో కన్పిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.

కూతురు కీర్తిని రజిత తీవ్రంగా మందలించింది. ఆగ్రహం తట్టుకోలేక కూతురిపై చేయి చేసుకొంది. అయితే ఈ అవమానాన్ని తట్టుకోలేని శశి రజితను చంపాలని భావించాడు.ఈ మేరకు తన ప్లాన్ ను కీర్తి ద్వారా అమలు చేశాడని పోలీసులు విచారణలో గుర్తించినట్టు సమాచారం.

Also Read: లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే

రజిత హెచ్చరించిన తర్వాత తన కారులోనే మద్యం తాగుతూ కీర్తితో వాట్సాప్ చాటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.మీ అమ్మ బతికి ఉంటే ఆస్తి దక్కదు, మన జీవితంలో సంతోషం ఉండదని శశి కీర్తికి నూరిపోశాడు. అంతేకాదు తాను చెప్పినట్టుగా వినకపోతే తనతో కీర్తి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు.

అంతేకాదు కీర్తి మొదటి ప్రియుడు బాల్ రెడ్డికి కూడ ఈ ఫోటోలు, వీడియోలను పంపుతానని బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కీర్తి పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. అప్పటికే తల్లి రజితపై కోపంతో ఉన్న కీర్తి కూడ శశి మాటలకు ఒప్పుకొంది.

Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో. 

అదనుచూసి ప్రియుడిని ఇంటికి పిలిచింది. తల్లి రజితను ప్రియుడు శశితో కలిసి కీర్తి హత్య చేసిందని సమాచారం.రజితను హత్య చేసి మృతదేహాన్ని ఫ్యాన్ కు ఉరి వేయాలని ప్లాన్ చేశారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో మరో ప్లాన్ చేశారు.

రజిత మృతదేహన్ని ఏం చేయాలనే విషయమై రెండు రోజుల పాటు శశి, కీర్తిలు తర్జన భర్జనపడ్డారు. రెండు రోజులుగా తల్లి మృతదేహం ఇంట్లోనే ఉంచుకొని కీర్తి ప్రియుడితో గడిపింది. అయితే రెండు రోజుల తర్వాత రజిత మృతదేహం నుండి దుర్వాసన వస్తుండడంతో కీర్తి ప్రియుడు శశిని అప్రమత్తం చేసింది.

ఈ నెల 22వ తేదీన రాత్రి పూట కీర్తి, శశిలు రజిత మృతదేహాన్ని కారులో ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా రామన్నపేటకు తీసుకెళ్లి రైలు పట్టాలపై రజిత మృతదేహాన్ని వేశారు. రజిత మృతదేహాం తరలింపులో శశి, కీర్తికి మరో వ్యక్తి సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఓ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి మాసంలో కీర్తిపై ఆమె మొదటి ప్రియుడు బాల్ రెడ్డి అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో తేల్చారు. అయితే గర్భస్రావం చేయించాలని బాల్ రెడ్డిపై కీర్తి ఒత్తిడి తేవడంతో ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్ లో కీర్తి అబార్షన్ చేయించుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

బాల్ రెడ్డికి కీర్తికి వివాహం చేయాలని కీర్తి కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.ఈ క్రమంలోనే శశితో కీర్తి సన్నిహితంగా ఉండడం చూసిన తల్లి రజిత ఆమెను హెచ్చరించినట్టుగా తెలిసింది.