తెలంగాణలో మరో సమ్మె సైరన్

First Published 14, Jun 2018, 5:24 PM IST
another strike in telangana
Highlights

తెలంగాణలో మరో సమ్మె సైరన్

తెలంగాణలో మరో సమ్మె సైరన్ మోగింది. కనీస వేతనం ఇవ్వాలని.. బయోమెట్రిక్ విధానంతో నష్టపోతున్నామని వాపోతూ జూలై 1 నుంచచి తెలంగాణ రేషన్ డీలర్లు సమ్మెకు సిద్ధమయ్యారు.. అలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. గత వారం వేతన సవరణతో పాటు అప్పులను రద్దు చేయాలనే డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘం సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేయడం అనంతరం మంత్రుల కమిటీ జరిపిన చర్చలు  సఫలం కావడంతో సమ్మె కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఇప్పుడు రేషన్ డీలర్ల సమ్మెను ప్రభుత్వం ఏ రకంగా సర్దుమణిగేలా చేస్తుందో వేచి చూడాలి.
    

loader