యాదాద్రి: హజీపూర్ వరుస అత్యాచారాలు, హత్యల కేసులో మరో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. చెట్టుపై మనీషా, కల్పన, శ్రావణి పేర్లను నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చెట్టుపై చెక్కినట్లు బయటపడింది. వారిద్దరిపై అతను అత్యాచారం చేసి, వారిని హత్య చేసిన విషయం తెలిసిందే.

మనీషా, కల్పన, శ్రావణి పేర్లను చెక్కిన చెట్టుకు అతను పూజలు చేసేవాడని అంటున్నారు. మర్రి శ్రీనివాసు రెడ్డి హజీపూర్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం చేసి, వారిని హత్య చేసి శవాలను బావిలో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే. 

శ్రీనివాస్‌రెడ్డిపై అదనపు నేరాలు చేర్చాలని కోరుతూ పోలీసులు నల్లగొండ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నల్గొండ కోర్టు సోమవారం విచారణ జరపనుంది. బాలికల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారుల బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పోలీసులు ఎన్ని విధాల ప్రయత్నించినా నిందితుడు నోరు విప్పడం లేదని తెలుస్తోంది. పోలీసులు కొద్దిరోజుల క్రితమే హాజీపూర్‌లో క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ను పూర్తి చేశారు. గ్రామస్తులు దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో రాత్రి సమయంలోనే క్రైం సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే, హజీపూర్ బాధిత కుటుంబాలకు చెందినవారు కలెక్టర్ ను కలిశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని వారు కోరారు. బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేశారు. 

బాధిత కటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా వారు కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్ కు ఓ వినతిపత్రం సమర్పించారు.