Asianet News TeluguAsianet News Telugu

బీజేపీకి మ‌రో షాక్.. టికెట్ నిరాకరించడంతో ములుగు నేత తాటి కృష్ణయ్య రాజీనామా

Mulugu-BJP: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎన్.రామచందర్రావు, ఎ.శ్రీదేవి సహా 14 మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను బీజేపీ విడుదల చేసింది అయితే, బీజేపీ టిక్కెట్ కోసం ఎదురుచూసిన వారిలో పలువురికి నిరాశ ఎదురుకావ‌డంతో పార్టీని విడుతున్నారు.
 

Another shock for the BJP. Mulugu BJP leader Tati Krishnaiah resigns after being denied ticket RMA
Author
First Published Nov 12, 2023, 6:43 AM IST

Telangana Assembly Elections 2023: ఎన్నిక‌లకు ముందు పార్టీని వీడుతున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌టంతో తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేప‌) విచిత్ర ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. ఇదే క్ర‌మంలో ములుగులో కాషాయ పార్టీకి షాత్ త‌గిలింది.  నామినేషన్ చివరి రోజు వరకు ములుగు పార్టీ టికెట్ రేసులో ఉన్న తాటి కృష్ణయ్య బీజేపీకి రాజీనామా చేశారు. శనివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కన్నీటిపర్యంతమయ్యారు.

ములుగు నియోజక వర్గంలో నాలుగేళ్లుగా బీజేపీతో మమేకమై జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు వేసి అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు సవాల్‌గా బీజేపీ క్యాడర్‌ను సిద్ధం చేశారన్నారు. టికెట్ల కేటాయింపులో కూడా బీజేపీని బలోపేతానికి లక్షల రూపాయలు అప్పు చేసి చివరి వరకు త‌మ‌కు నాయకత్వం ఇస్తానని నమ్మి నాయకులు, కార్యకర్తలను తన పక్షాన ఉంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినా పార్టీ క్యాడర్‌ను కాపాడుకుంటూ చివరకు గొంతు కోసుకున్నారు. పార్టీ టిక్కెట్లు వేరే వారికి ఇచ్చినా రాష్ట్ర, జిల్లా నాయకులు ఎవరూ తనను సంప్రదించలేదని, భవిష్యత్తులో పార్టీ ఎలాంటి హామీ ఇస్తుందో కూడా చెప్పకుండా బీజేపీ పార్టీ తనను అవమానించిందని అన్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ వ్యవహారశైలి నచ్చక తనకు ఇచ్చిన పదవికి రాజీనామా చేస్తున్నానని, ములుగు నియోజకవర్గంలో తన క్యాడర్ నిర్ణయం మేరకే భవిష్యత్తు ప్రణాళిక ఉంటుందని తాటి కృష్ణ ప్రకటించారు. ఆయనతో పాటు ఏడు మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios