నయీం కేసులో మరో ట్విస్ట్

Another police officer suspended in nayeem case
Highlights

  • కల్వకుర్తి డిప్యూటీ జైలర్ సుధాకర్ పై వేటు
  • సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
  • పాశం శీనుకు ఫోన్లు సరఫరా చేసినట్లు ఆధారాలు వెల్లడి

నయీం కేసు... ఈ కేసు గురించి వినగానే అసలు నయీం కేసు మనుగడలో ఉందా? మూసివేశారా అన్న అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే ముందుగాల ఈ కేసులో అందరూ దొంగలే అన్నారు. ప్రతిపక్ష పార్టీలో నయీం దోస్తులున్నారని లీకులు వచ్చాయి. తర్వాత అధికార పార్టీలో నయీం చెంచాగాళ్లు ఉన్నారని లీకులు వచ్చాయి. తర్వాత పోలీసోళ్లు కూడా నయీం చెంచాలే అని లీకులు వచ్చాయి. నయీం డైరీ ఉందని లీక్ వచ్చింది. నయీం కు కోట్ల కొద్దీ ఆస్తులున్నాయని ఆరోపణలు వచ్చాయి. వందల ఎకరాల భూములు కబ్జా చేసిండని నివేదికలు వెల్లడైనాయి.

కానీ ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకుడి మీద యాక్షన్ తీసుకోలేదు. తూచ్... అంతా ఉత్తదే అన్నట్లు పరిస్థితి మారింది. ఇప్పుడు ఆ కేసు నీరుగారిపోయిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ ఈకేసును తెలంగాణ పోలీసులు కదలించారు. తాజాగా నయీం కేసులో కల్వకుర్తి డిప్యూటీ జైలర్ సుధాకర్ ను సస్పెండ్ చేశారు.

నయీం సన్నిహితుడు పాశం శ్రీను కు జైలు లోపల సెల్ ఫోన్లు అందజేసినట్లు సుధాకర్ మీద ఆరోపణలు వచ్చాయి. సుధాకర్ ఫోన్ల నుంచి పాశం శీను పలువురిని బెదిరించాడు కూడా. పాశం శీను బెదిరి0పులను ఇంటెలిజెన్స్ వారు గుర్తించారు. వెంటనే జైలు అధికారులకు సమాచారం అందించారు. దీంతో సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

loader