Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్..! ములుగు జిల్లాలో భూసామర్థ్య పరీక్షలు..

తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కాబోతోంది. ఎప్పటినుంచో వార్తల్లో ఉండి, పలుమార్లు సర్వేలు చేపట్టిన మణుగూరు-రామగుండం రైల్వే లైను నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. 

Another new railway line in Telangana, Land capacity tests in Mulugu district
Author
First Published Oct 6, 2022, 8:44 AM IST

భద్రాద్రి కొత్త గూడెం : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మీదుగా మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేపట్టిన మణుగూరు-రామగుండం రైల్వే లైను నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. దీంతో రాబోయే బడ్జెట్ లో ఈ లైనుకు నిధులు మంజూరు కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. బొగ్గు, విద్యదుతుత్పత్తి కేంద్రాలుగా ఉన్న మణుగూరు, రామగుండం మధ్య కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని రెండు దశాబ్దాల కిందట లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సర్వే నిర్వహించారు. 

ఆ తరువాత కూడా అనేకసార్లు సర్వేలు జరిగాయి. ఇరవై యేళ్లుగా సర్వేలు తప్ప లైన్ విషయంలో మరే పురోగతి కనిపించలేదు. భద్రాచలం రోడ్డు-కొవ్వూరు రైల్వై లైన్ తరహాలోనే ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలకే పరిమితమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. కానీ, ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు కదలిక వచ్చింది. 

దసరారోజు స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుంటే.. పిడుగుపడి ముగ్గురి మృతి...

భూసామర్ధ్య పరీక్షలు
ఇటీవల సరుకు రవాణాకు రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. త్వరగా సరుకు రవాణా కోసం ప్రత్యేక ట్రాక్ లను సైతం నిర్మిస్తోంది. దీంతోపాటు ట్రిపుల్ ఆర్ (రివర్, రైల్, రోడ్డు) కాన్సెప్ట్ తో సరుకు రవాణాకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇటు మణుగూరు, అటు రామగుండం రెండు పట్టణాలు గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. ఈ రెండు పట్టణాల మధ్య రోడ్డు మార్గం ఉంది. ఇప్పుడు అదనంగా రైలు మార్గం నిర్మాణం మీద కేంద్రం దృష్టి సారించి, ఇప్పటికే సర్వే పూర్తయినందున రైలు మార్గం నిర్మాణానికి రెడీ అవుతోంది. అందులో భాగంగా రైలు మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ములుగు జిల్లాలో ప్రాంతాల్లో మట్టి నమూనా పరీక్షలు జరుగుతున్నాయి. 

ప్రయోజనాలు
 ప్రస్తుతం రామగుండం- కాజీపేట- డోర్నకల్- భద్రాచలం రోడ్డు  -మణుగూరు మార్గం 291 కిలోమీటర్ల నిడివితో ఉంది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అదేవిధంగా భూపాలపల్లి లో ఉన్నా సింగరేణి బొగ్గు గనులు, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ లకు రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. న్యూఢిల్లీ - చెన్నై గ్రాండ్ ట్రంక్ లైన్ లో.. నాగ్పూర్ విజయవాడ సెక్షన్లో కీలక ప్రత్యామ్నాయ మార్గంగా ఈ లైన్  నిలవనుంది. 

మణుగూరు- రామగుండం కొత్త మార్గానికి సంబంధించి రామగుండం దగ్గర ఉన్న రాఘవాపురం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడినుంచి మంథని- భూపాలపల్లి-  మేడారం- తాడ్వాయి- కాటాపూర్- గోపాలపురం రామానుజపురం  మీదుగా మణుగూరు చేరుకుంటుంది. మొత్తంగా  రాఘవాపురం నుంచి మణుగూరు వరకు 197కిలోమీటర్ల నిడివితో ఈ మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. చివరిసారిగా చేసిన సర్వేలో ఈ  లైన్ నిర్మాణానికి  కిరూ. మూడువేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios