హైదరాబాద్: తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్లె జాజాల సురేందర్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన జిల్లాలోని రామారెడ్డి మండలంలో జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పొల్గొన్నట్లు సమాచారం.

తెలంగాణలో కరోనా వైరస్ సోకిన ఎమ్మెల్యేల చిట్టా పెద్దదే. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నుంచి మొదలుపెడితే వివేకానంద వరకు పలువురు కరోనా వైరస్ వ్యాధికి గురయ్యారు. వీరిలో చాలా మంది కోలుకున్నారు. 

నిజామాబాద్ జిల్లాకు చెందిన బాజిరెడ్డి గోవర్దన్ తదితరులు కరోనా వైరస్ వ్యాధికి గురయ్యారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందుతూనే ఉంది. బుధవారం ఉదయం తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.... తెలంగాణ కోరనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 93 వేలు దాటింది.