Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మళ్లీ మూతపడనున్న సినిమాథియేటర్లు !?

తెలంగాణలో కరోనా లాక్ డౌన్  తరువాత ఈ మధ్యే తెరుచుకున్న సినిమా థియేటర్లు మళ్లీ మూతపడేలా కనిపిస్తున్నాయి. సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య ఏర్పడిన వివాదమే దీనికి కారణం అని తెలుస్తోంది. మల్టీప్లెక్సులకు ఉండే హక్కులనే సింగిల్ స్క్రీన్లకు కూడా వర్తింప జేయాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. 

another lockdown for cinema theatres in telangana? - bsb
Author
Hyderabad, First Published Feb 4, 2021, 1:26 PM IST

తెలంగాణలో కరోనా లాక్ డౌన్  తరువాత ఈ మధ్యే తెరుచుకున్న సినిమా థియేటర్లు మళ్లీ మూతపడేలా కనిపిస్తున్నాయి. సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య ఏర్పడిన వివాదమే దీనికి కారణం అని తెలుస్తోంది. మల్టీప్లెక్సులకు ఉండే హక్కులనే సింగిల్ స్క్రీన్లకు కూడా వర్తింప జేయాలని థియేటర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. 

అంతేకాకుండా మల్టీప్లెక్సుల మాదిరే పర్సంటేజ్ సిస్టమ్ ను అమలు చేయాలని అల్టిమేటం జారీ చేశారు. పెద్ద సినిమా విడుదలైన ఆరు వారాల తర్వాత, చిన్న సినిమా విడుదలైన 4 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు. 

తాము చేస్తున్న ఈ డిమాండ్లు ఒప్పుకోకపోతే మార్చి 1నుంచి థియేటర్లు మూసేస్తామని హెచ్చరించారు. దీంతో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు, తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ల మధ్య చర్చలు జరిగాయి. 

దగ్గుబాటి సురేష్ బాబు అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశంలో డివివి దానయ్య, అభిషేక్ నామా, మైత్రి రవి, బివిఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లాక్ డౌన్ తరువాత తిరిగి తెరుచుకున్న థియేటర్లలో సినిమాల సందడి పెరుగుతున్న సంగతి తెలిసిందే. 

చిన్న, పెద్ద సినిమాలు భారీగా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ యేడాది వేసవిలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపత్యంలో ఎగ్జిబిటర్లు ఈ డిమాండ్లతో ముందుకు వచ్చారు. దీని మీద నిర్మాతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios