జూనియర్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి సర్కార్ ఆమోదం భారీ సంఖ్యలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. విద్యాశాఖలో ఖాళీగా వున్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం తాజా నిర్ణయం ద్వారా ఆ వేగాన్ని రెట్టింపు చేసింది.
 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మొత్తం 1,113 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతినిచ్చింది. ఇందులో జూనియర్ కాలేజీల్లో 46 ప్రిన్సిపల్‌, 781 జూనియర్‌ లెక్చరర్లు, 77 సీనియర్‌ అసిస్టెంట్లు, 76 జూనియర్‌ అసిస్టెంట్లు, 78 ఫిజికల్‌ డైరెక్టర్లు, 78 లైబ్రేరియన్‌ పోస్టులు ఉన్నాయి. భారీ సంఖ్యలో ఇన్ని పోస్లులకు ఒకేసారి ప్రభుత్వం అనుమతి తెలపడంతో నిరుద్యోగ యువతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.