Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ టిడిపి తమ్ముళ్లకు శుభవార్త

  • తెలంగాణ నేతలతో బాబు సమావేశం ఫిక్స్
  • ఫిబ్రవరి 28న తమ్ముళ్లకు దిశా నిర్దేశం
  • ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ్ముళ్లు
  • నేతలు తమ దారి చూసుకుంటున్నా.. కేడర్ ఇంకా టిడిపిలోనే
another good news for telangana tdp leaders

తెలంగాణ టిడిపి తమ్ముళ్ల ఎదరుచూపులకు ఫలితం దక్కబోతున్నది. క్షణాలే యుగాలుగా గడుపుతున్న తెలుగుదేశం కార్యకర్తలకు తీపి కబురు అందింది. పార్టీ భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకున్న వేళ తెలుగు దళానికి దశా నిర్దేశం లభించే చాన్స్ దొరికింది. మరి అంతటి శుభవార్త ఏముందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి ఈ స్టోరీ.

తెలంగాణలో టిడిపి పరిస్థితులు రోజు రోజుకూ ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే పెద్ద పెద్ద లీడర్లంతా పార్టీ నుంచి జంప్ అయ్యారు. పార్టీలో జెండాలు మోయకుండా ఎసి కార్లు, బుగ్గ కార్లలో తిరిగినోళ్లంతా పార్టీని నడి నీళ్లలో వదిలేసి తమ దారి తాము చూసుకున్నారు. జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన కార్యకర్తలంతా పార్టీలో అలాగే నిలబడి ఉన్నారు. కానీ వారికి దశా దిశ చూపే పరిస్థితి లేకపోవడంతో నైరాశ్యంతో ఉన్నారు.

పార్టీ అధినేత చంద్రబాబు రాక కోసం తెలంగాణ తమ్ముళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదిగో.. ఇదిగో వస్తున్నారంటూ కబురు వస్తున్నది. కానీ.. ఏదో కారణంగా ఆయన రాలేకపోతున్నారు. ఇప్పటికే అనేకసార్లు అధినేత వస్తారన్న కబురు అందింది కానీ.. చివరి నిమిషంలో క్యాన్సల్ అయింది. మొన్నటికి మొన్న బాబు టూర్ ఫిక్స్ అయినట్లే అయింది.. అంతలోనే పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు మరణించారు. దీంతో బాబు తెలంగాణ పర్యటన వాయిదా పడింది. అయితే ఇప్పుడు తెలంగాణ పర్యటన ఖరారు కావడంతో తమ్ముళ్లు జోష్ మీదున్నారు.

గురువారం తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు అమరావతి నుంచి టేలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తెలంగాణ లో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ తెలంగాణ అధ్యక్షులు యల్.రమణ ఇక్కడి పార్టీ కార్యకలాపాలై బాబుకు బ్రీఫ్ చేశారు. అయితే ఈ నెల 28న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ ముఖ్య నేతలతో బాబు సమావేశం జరపాలని ఈ టెలికాన్ఫరెన్స్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన టిడిపి ముఖ్య నేతలు సంబరపడుతున్నారు.

పార్టీలో ఉన్న అస్థిర పరిస్థితులపై చంద్రబాబు తెలంగాణ ముఖ్య నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఫిక్స్ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద లీడర్లంతా క్యూ కట్టి వెళ్లిపోగా.. ఇంకొందరు లీడర్లు కూడా పార్టీని వీడేందుకు స్కెచ్ లు రెడీ చేశారు. ఏ క్షణంలోనైనా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. బాబుతో జరిపే సమావేశంలోనే నియోజకవర్గాల ఇన్ ఛార్జుల నియామకం చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అలాగే వరంగల్ జిల్లాకు చెందిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య టిడిపిలో చేరనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీనే ఆయన జాయినింగ్ జరగాల్సి ఉండగా గాలి ముద్దు క్రిష్ణమనాయుడు మృతి కారణంగా బాబు టూర్ క్యాన్సల్ అయింది. అలాగే మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరనున్నట్లు టిడిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే బాబు పర్యటన తర్వాత కొత్త వాతావరణంలో టిడిపి పనిచేస్తుందా? లేదంటే పాత చింతకాయ పచ్చిడలాగానే ఉంటుందా అన్నది ఈనెల 28 తర్వాత తేలనుంది. తమ శక్తి మేరకు పార్టీని తెలంగాణలో నిలబెడతామని హైదరాబాద్ కు చెందిన పార్టీ నాయకురాలు ఏషియానెట్ కు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios