యాదాద్రి: హజీపూర్ ఘటనను మరవక ముందే యాదాద్రి జిల్లాలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.  దివ్యాంగురాలైన బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం యాదాద్రిజిల్లా వలిగొండ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. అదే మండలానికి చెందిన మాటలు రాని, నడవలేని ఓ మానసిక దివ్యాంగురాలు తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. 

తన తల్లి ఇంటిమేడమీద నిద్రించడానికి వెళ్లగా, ఆ బాలిక ఇంటి ఆవరణలోనే నిద్రిస్తోంది. దాన్ని గుర్తించిన అదే గ్రామానికి చెందిన బూరుగు మహేందర్‌ అలియాస్‌ మహేష్‌ ఇంటి ప్రహరీ దూకి లోపటిలికి ప్రవేశించాడు. నిద్రిస్తున్న బాలికపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నాడు. మాటలు రాని యువతి అరవలేకపోయింది. అయితే మూలుగు చప్పుళ్లను మేడపై నిద్రిస్తున్న బాలిక తల్లి విని కిందికి వచ్చింది.

మహేందర్‌ తన కూతురిపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని చూసింది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడనుంచి పారిపోయాడు. బాలిక తల్లి, తన సోదరుడితో కలిసి అదేరాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు సకాలంలో స్పందించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. 

ఆ తర్వాత నిందితుడిని బాధితురాలి కుటుంబ సభ్యులు పట్టుకుని చితక్కొట్టారు. 100 నెంబరుకు ఫోన్‌ చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం రామన్నపేట ప్రభుత్వా సుపత్రికి తరలించారు.
 
మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడిచేసిన నిందితుడు మహేందర్‌ను ఉరి తీయాలని డిమాండ్‌ చే స్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ స్థులు భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై రాస్తా రోకో  నిర్వహించారు సుమారుగా 40నిమిషాలపాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. 

సంఘటన స్థలానికి ఏసీపీ సత్తయ్య, సీఐ శ్రీని వాస్‌, ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ చేరుకొని బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు రా స్తారోకో విరమించేది లేదని పట్టుబట్టారు. పోలీసులు నిందితున్ని శిక్షిస్తామని హామీఇవ్వడంతో, రాస్తారోకో విరమించారు.