కేటిఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

First Published 7, Apr 2018, 6:37 PM IST
Another Foreign invitation for ktr
Highlights
ఇప్పుడు ఏ దేశం నుంచో తెలుసా ?

ఇప్పటికే దేశ విదేశాల నుంచి ప్రతిష్టాత్మక సమావేశాలు  అహ్వానాలు అందుకుంటున్న  పరిశ్రమ శాఖ మంత్రి కెటి రామారావుకు మరోక అంతర్జాతీయ అహ్వానం లభించింది. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిగే సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఏకానామిక్ ఫోరమ్ సమావేశానికి హజరుకావాల్సిందిగా కోరారు. 

మే నెల 24, నుంచి 26 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రపంచ వాణిజ్యవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గోని, రష్యాతోపాటు, అంతర్జాతీయ అర్ధిక వ్యవస్ధ గురించి చర్చిస్తారని మంత్రికి పంపిన సమావేశంలో నిర్వహాకులు తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గోని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వాణిజ్య ప్రధాన్యతలు, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వపాలసీలపైన ఈ సమావేశానికి హజరయ్యే ప్రతినిధులకు వివరించాలని కోరారు. ఈ సమావేశానికి అహ్వానం దక్కడం పట్ల మంత్రి కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు.

loader